మళ్లీ అవే నిబంధనలతో కమలతో డిబేట్‌కు సిద్ధం: ట్రంప్‌

Published on Wed, 08/28/2024 - 08:17

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 10న అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్‌, డొనాల్డ్ ట్రంప్‌ మధ్య జరగబోయే డిబేట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ డిబెట్‌పై ట్రంప్‌ స్పందిస్తూ.. డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో డిబెట్‌ కోసం ఒప్పదం కుదుర్చుకున్నట్లు తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌లో వెల్లడించారు.

‘కామ్రేడ్ కమలా హారిస్‌తో సెప్టెంబర్ 10న ఫిలడెల్ఫియాలో జరిగే డిబేట్‌ కోసం నేను రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్‌లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను. ఈ డిబేట్‌ ఏబీసీ ఫేక్ న్యూస్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అయితే న్యూస్‌ సంస్థ మాత్రం చాలా అన్యాయమైంది’ అని అన్నారు. నిబంధనల విషయంలో ట్రంప్ ఈ డిబేట్‌ను రద్దు చేస్తారని వార్తలు వెలుడిన ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్ 27 సీఎన్‌ఎన్‌లో తాను, అధ్యక్షుడు జో బిడెన్‌తో తలపడిన డిబేట్‌  నియమాలే.. కమలతో జరిగే డిబేట్‌లో  ఉంటాయని తెలిపారు. వాటిని తాను పాటించడానికి  ఒప్పందాన్ని కుదుర్చుకున్నానని తెలిపారు.

‘‘సీఎన్‌ఎన్‌ డిబేట్ నిబంధనలే ఉంటాయి. అయితే ఈ నిబంధనలు  ప్రెసిడెంట్‌ జో బైడెన్‌కు మినహా అందరికీ బాగా అనిపించాయి. డిబేట్‌లో అభ్యర్థులు నిలబడి మాట్లాడుతారు. అభ్యర్థులు నోట్స్ లేదా షీట్లు తీసుకురావటం ఉండదు. ఇక.. ఈ డిబేట్‌ న్యాయమైన చర్చగా ఉంటుందని ఏ పక్షానికి ముందుగానే ప్రశ్నలు ఇవ్వటం జరగదని ఏసీబీ ద్వారా మాకు హామీ ఇచ్చింది’’ అని పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)