Breaking News

హెచ్‌–1బీ లాటరీకి చెల్లుచీటీ

Published on Wed, 12/24/2025 - 05:26

న్యూయార్క్‌/వాషింగ్టన్‌: హెచ్‌–1బీ వీసాలపై కొంతకాలంగా కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్న ట్రంప్‌ సర్కారు వాటి కట్టడి దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌–1బీ వీసాదారుల ఎంపికకు పాటిస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం మంగళవారం ప్రకటించింది. ఇకపై అత్యధిక నైపుణ్యం, వేతనం ఉన్న వారికే ఆ వీసాల జారీలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టంచేసింది. దీంతో నైపుణ్యం తక్కువగా ఉన్న విదేశీఉద్యోగుల రాక తగ్గిపోయి ఆ ఉద్యోగాలు అమెరికన్లకు దక్కే అవకాశముంది. హెచ్‌–1బీ వీసాల జారీని ఇకపై యూఎస్‌ సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్విసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) ద్వారా చేపట్టనుంది. ‘‘ఇప్పటిదాకా కొనసాగిన కంప్యూటరైజ్డ్‌ హెచ్‌–1బీ వీసా లాటరీ వ్యవస్థ లోపభూయిష్టంగా తయారైంది.

దీనిని కంపెనీలు ఎంతగానో దుర్వినియోగం చేశాయి. విదేశీ ఉద్యోగులను కారుచవగ్గా తీసుకొచ్చి అమెరికాలో పని చేయించుకున్నాయి. ఫలితంగా ఐటీ తదితర ఉద్యోగాల్లో అమెరికన్లకు చాలా అన్యాయం జరిగింది. ఇకపై దీన్ని సరిదిద్దుతాం. ఇకపై నాలుగు రకాలుగా వేతనాలను వర్గీకరించి దానికనుగుణంగా హెచ్‌–1బీలను జారీచేస్తాం. ఎంట్రీ లెవల్‌ అభ్యర్థులు(1), అర్హత సాధించిన అభ్యర్థులు(2), అనుభవం ఉన్న అభ్యర్థులు(3), అత్యధిక నైపుణ్యమున్న అభ్యర్థులు(4)గా దరఖాస్తులను విభజించి ఆ మేరకే హెచ్‌–1బీ వీసాలను జారీచేయాలని ప్రతిపాదించాం. ఈ ప్రతిపాదనలను ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌(ఓఎంబీ)కి సమీక్ష కోసం పంపించాం. అక్కడ ఆమోదం పొందాక ఫెడరల్‌ రిజిస్టర్‌లో ప్రచురిస్తాం.

ఆ తర్వాత 30 రోజులకు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి’’ అని యూఎస్‌సీఐఎస్‌ అధికార ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్‌ స్పష్టం చేశారు. హెచ్‌–1బీ వీసా విధానాన్ని సమూలంగా సంస్కరించాలన్న ట్రంప్‌ ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే అన్ని స్థాయిల్లో అర్హులకు వీసాలు లభించేలా చూసే ప్రయత్నం జరుగుతుందంటూ ఆయన ముక్తాయించారు. కొత్త విధానం వచ్చే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అమెరికాలో ఉన్నతోద్యోగాలు చేయాలన్న విద్యాధిక భారత యువత, ముఖ్యంగా ఐటీ జీవుల కలలపై ఈ నిర్ణయం మరిన్ని నీళ్లు చల్లింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)