ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న యాగి

Published on Tue, 09/03/2024 - 05:31

మనీలా: ఫిలిప్పీన్స్‌ను ‘యాగి’తుపాను వణికిస్తోంది. పలుప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని మనీలాలో మరికినా నది ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. మనీలాతోపాటు అత్యధిక జనసాంద్రత కలిగిన లుజాన్‌ ప్రాంతంలో అధికారులు ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

 క్వెజాన్‌ ప్రావిన్స్‌లోని ఇన్ఫాంటా పట్టణంలో ఈదురుగాలుల తీవ్రతకు నివాసాలు దెబ్బతిన్నాయి. రిజాల్‌ ప్రావిన్స్‌లోని అంటిపొలో సిటీలో ఇళ్లు కూలిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు నీట మునిగారు. సమర్‌ ప్రావిన్స్‌లోని సెబులో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నలుగురు చనిపోగా 10 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. కామరిన్స్‌ సుర్‌ ప్రావిన్స్‌లోని నాగా నగరంలో వరద నీటిలో మరో ముగ్గురు చనిపోయారు.

 మనీలాకు దక్షిణాన ఉన్న కావిట్‌ ప్రావిన్స్‌లో నివాస ప్రాంతాల్లోకి నడుములోతుకు పైగా వరద చేరడంతో యంత్రాంగం బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను కారణంగా పలు నౌకాశ్రయాల్లో 3,300 మంది ఫెర్రీ ప్రయాణికులు, సిబ్బంది చిక్కుబడి పోయారు. పలు దేశీయ విమాన సరీ్వసులను రద్దు చేశారు. మనీలాలోని నవోటాస్‌ పోర్టులో రెండు ఓడలు ఢీకొన్నాయి. అనంతరం ఒక ఓడ బలమైన గాలుల తీవ్రతకు వంతెనను ఢీకొనడంతో తీవ్రంగా దెబ్బతింది. ఓడలో మంటలు చెలరేగడంతో అందులోని సిబ్బందిని కాపాడారు. 

పసిఫిక్‌ రింగ్‌ఆఫ్‌ ఫైర్‌ ప్రాంతంలో ఉన్న ఫిలిప్పీన్స్‌పై ఏటా 20కి పైగా తుపాన్లు ప్రభావం చూపిస్తుంటాయి. 2013లో సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భీకర తుపాను హయియాన్‌తో కనీసం 7,300 మంది చనిపోవడమో లేక గల్లంతవ్వడమో జరిగింది. మరో 50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)