130 అడుగుల కొండ, వయ్యారంగా సెల్ఫీ..కట్‌ చేస్తే

Published on Tue, 12/09/2025 - 16:56

పర్యాటక ప్రదేశానికి వెళ్లినపుడు, అక్కడి ప్రకృతిని  ఆస్వాదించడం కంటే, సెల్పీ తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం పైనే దృష్టి. ప్రాణాలకు తెగించి మరీ  సెల్ఫీ తీసుకునేటపుడు పొంచి ఉన్న ప్రమాదాలపై  ఎన్నిమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ  ఈ ధోరణి మాత్రం మారణం లేదు. అత్యంత ప్రమాదకరమైన 130 అడుగులు కొండపై నుంచి నడుస్తున్నపుడు సెల్ఫీ తీసుకుంటూ జారీ పడ్డాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ది సన్  కథనం ప్రకారం, చైనాలోని గ్వాంగ్'ఆన్‌లోని హువాయింగ్ పర్వతంపై ఈ సంఘటన జరిగింది.  బ్లేడ్ రాక్  అనే పర్యాటక ప్రదేశంలోని 130 అడుగుల కొండ శిఖరం వద్ద  సెల్ఫీ తీసుకుంటూ జారి పడిన పర్యాటకుడు అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింటవైరల్‌గా మారింది. దీని ప్రకారం అతను  ఫోన్ పట్టుకుని కొండ అంచున నడుస్తున్నాడు. రాళ్లపై తన అడుగులు ఎక్కడ పడుతున్నాయో చూసుకుంటూ అడుగులు వేస్తున్నాడు. సెల్పీ కోసం ఇటు తిరిగాడు. అంతే క్షణాల్లో, అతని పాదాల కింద ఉన్న రాయి జరిగిరి, అదుపు తప్పి, ఠక్కున జారిపడ్డాడు. అలా కింద ఉన్న చెట్ల పొదలలోకి పడిపోయాడు.

ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్‌

ఇది చూసి తోటి హైకర్లు దెబ్బకి షాక్‌అయ్యారు.  కేకలు పెడుతూ కొండ అంచున పరుగులుపెట్టారు.  కానీ పడిపోయిన వ్యక్తి దాదాపు 15 మీటర్ల ఎత్తులో ఉన్న అడవిలో పడిపోయాడు. ఆ భయంకరమైన జలపాతం నుండి తీవ్రమైన గాయాలు లేకుండా , ప్రాణాలతో  బతికి బయటపడ్డాడు.

 

ఆ దేవతలే కాపాడారు 
ఈ విషయాన్ని  సదరు  పర్యాటకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ WeChatలో పోస్ట్ చేశాడు. చచ్చిపోతాననే అనుకున్నా.. కానీ ఆ పర్వత దేవతలే నన్ను  ఆశీర్వదించారు.  చాలా అదృష్టవంతుడిని. 40 మీటర్ల ఎత్తైన కొండపై నుండి పడి దాదాపు 15 మీటర్లు వాలుపైకి దొర్లాను అని  రాసుకొచ్చాడు. మరోవైపు  ప్రమాదం జరిగిందని చెబుతున్న  బ్లేడ్ రాక్ ర్యాటక ప్రదేశం సుందరమైన ప్రాంతం ,  సరిహద్దుల్లో లేదు. వారు ఈ ప్రాంతాన్ని "దూరం నుండి మాత్రమే వీక్షించడానికి అనుమతి ఉంది ,  ఎక్కడానికి అనుమతి లేదు అని చెప్పారు అధికారులు. హైకింగ్ చేస్తున్నప్పుడు  నిబంధనలను పాటించాలని,  ఇలాంటి  ప్రమాదకరమైన ప్రాంతాలలోకి ప్రవేశించకూడదని  సందర్శకులకు గుర్తు చేశారు.

ఇదీ చదవండి: రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్‌, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్‌ నోటీసులు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)