Breaking News

Toshakhana corruption case: తోషఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష

Published on Thu, 02/01/2024 - 04:56

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. తోషఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్‌ కోర్టు 14 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. విదేశీ నాయకులు ఇచ్చిన ఖరీదైన బహుమతులను విక్రయించి, సొమ్ము చేసుకున్నట్లు ఇమ్రాన్‌ దంపతులపై అభియోగాలు నమోదయ్యాయి.

దర్యాప్తులో అదంతా నిజమేనని తేలడంతో న్యాయస్థానం బుధవారం శిక్ష ఖరారు చేసింది. దోషులకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదంటూ కోర్టు ఇమ్రాన్‌ ఖాన్‌పై అనర్హత వేటు కూడా వేసింది. 1.5 బిలియన్ల జరిమానా చెల్లించాలని ఇమ్రాన్‌ దంపతులను ఆదేశించింది.

ఫిబ్రవరి 8న పాకిస్తాన్‌ పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. విదేశాలకు అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి దేశాధినేతలు బహుమతులు ఇస్తుంటారు. అవన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. తోషఖానాలో భద్రపర్చాల్సి ఉంటుంది. ఇమ్రాన్‌ మాత్రం సొంత  ఆస్తిలాగా అమ్మేసుకున్నారు. అధికార రహస్యాల వెల్లడి కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు మూడు రోజుల క్రితం 10 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే.   

Videos

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు