Breaking News

హమాస్‌ చెర నుంచి మరో ముగ్గురికి విముక్తి 

Published on Sun, 02/09/2025 - 05:32

డెయిర్‌ అల్‌–బలాహ్‌: కాల్పుల విరమణ ఒప్పందం మేరకు శనివారం హమాస్‌ మిలిటెంట్లు మరో ముగ్గురు ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేశారు. ప్రతిగా ఇజ్రాయెల్‌ తమ జైళ్లలో ఉన్న 183 మంది పాలస్తీనియన్లను వదిలేసింది. వందలాదిమంది సాయుధ హమాస్‌ శ్రేణులు ఎలి షరాబీ(52), బెన్‌ అమి(56), ఒర్‌ లెవీ(34) అనే బందీలను వేదికపైకి తీసుకువచ్చాయి. అనంతరం వారిని రెడ్‌క్రాస్‌కు అప్పగించాయి. 

ఎంతో బలహీన స్థితిలో ఉన్న వారిని మాట్లాడాలంటూ బలవంత పెడుతున్నట్లుగా ఉన్న దృశ్యాలు మీడియాలో రావడంపై ఇజ్రాయెల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందం షరతులను హమాస్‌ ఉల్లంఘిస్తోందని, మధ్యవర్తులకు ఈ విషయమై అభ్యంతర వ్యక్తం చేస్తామని తెలిపింది. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ శ్రేణులు అపహరించుకుపోయిన సుమారు 250 మంది పై ముగ్గురు కూడా ఉన్నారు. జనవరి 19న కుదిరిన ఒప్పందం అనంతరం హమాస్‌ 18 మంది బందీలకు విముక్తి కల్పించింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)