Breaking News

‘వరద’ వైఫల్యాలపై స్పెయిన్‌లో భారీ నిరసనలు

Published on Mon, 11/11/2024 - 06:09

వరదల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్పెయిన్‌లో లక్షలాది మంది రోడ్డెక్కారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ వాలెన్సియాలో శని, ఆదివారాల్లో ఆందోళనకు దిగారు. వాలెన్సియా రీజనల్‌ హెడ్‌ కార్లోస్‌ మజోన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేశారు. దాదాపు 1,30,000 మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. వాలెన్సియా సిటీ హాల్‌ను బురదతో నింపేశారు. కురీ్చలు, వస్తువులకు నిప్పు పెట్టారు. పలుచోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు. వాలెన్సియా, పరిసర ప్రావిన్సుల్లో ఇటీవల కుండపోత వర్షాలకు వరద ముంచెత్తి 200 మందికి పైగా మరణించడం తెలిసిందే. 

80 మందికి పైగా గల్లంతయ్యారు. వేలాది మంది నిర్వాసితులయ్యారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వీధులు బురద, శిథిలాల్లో కూరుకుపోయి ఉన్నాయి. స్పెయిన్‌ వాతావరణ సంస్థ అక్టోబర్‌ 25 నుంచే ఈ ప్రాంతానికి తుపాను హెచ్చరికలు జారీ చేసినా వరదలు మొదలయ్యే దాకా వాలెన్సియా అధికారులు ప్రజలను అప్రమత్తం చేయలేదు. వారి అలసత్వం వల్లే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని జనం మండిపడుతున్నారు. గత వారం పైపోర్టా పట్టణాన్ని సందర్శించిన స్పెయిన్‌ రాజు, రాణిపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. అనంతరం ప్రధాని పెడ్రో సాంచెజ్‌పై  గుడ్లు తదితరాలు విసిరి నిరసన తెలిపారు.     

– వాలెన్సియా

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)