Breaking News

దోస్తానా ముగిసింది!

Published on Fri, 05/30/2025 - 04:26

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ల స్నేహానికి ఎండ్‌ కార్డ్‌ పడిందా? అవుననే అనిపిస్తోంది. ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ నినాదంతో 300 మిలియన్‌డాలర్లకు పైగా నిధులు సమకూర్చి ట్రంప్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన మస్క్‌.. ప్రభుత్వ బాద్యతల నుంచి వైదొలిగారు. అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌) నుంచి ఆయన తప్పుకున్నారు. ప్రభుత్వంలో తన షెడ్యూల్‌ ముగిసిందని ప్రకటించారు. 

వృధా ఖర్చులను తగ్గించే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మస్క్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తన దృష్టి అంతా టెస్లా, స్పేస్‌ఎక్స్‌లపైనే కేంద్రీకరిస్తానని మస్క్‌ స్పష్టంచేశారు. అయితే.. సమాఖ్య ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయడానికి, పునర్నిర్మించడానికి డోజ్‌ చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతాయని వైట్‌ హౌస్‌ పేర్కొంది. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన 130 రోజుల పదవీకాలం మే 30వ తేదీతో ముగియనుండగా.. ముందుగానే ఆయన రాజీనామా చేశారు. 

ట్రంప్‌తో సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని తెలుస్తోంది. ‘ప్రత్యేక వ్యక్తి, సూపర్‌ జీనియస్, ఫస్ట్‌ ఫ్రెండ్, దేశభక్తుడు’... డోజ్‌ బాధ్యతలు చేపట్టక ముందునుంచే మస్క్‌ను ప్రశంసించడానికి ట్రంప్‌ ఉపయోగించిన పదాలివి. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన దగ్గర నుంచి ఫిబ్రవరి వరకు అవకాశం దొరికిన ప్రతిచోటా మస్క్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్‌.. మార్చినుంచి కొంత తగ్గించారు. 

వివాదాస్పద నిర్ణయాలతో వరసబెట్టి కార్యనిర్వాహక ఉత్తర్వులిస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌కు కుడిభుజంగా ఉండి.. వేలమంది కేంద్ర ప్రభుత్వోద్యోగులను మస్క్‌ సాగనంపడం, వేలకోట్ల విలువైన ప్రభుత్వ ఒప్పందాలు, కాంట్రాక్టులను రద్దుచేయడం తెలిసిందే. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. ఇటీవలి వైట్‌హౌస్‌ కార్యకలాపాలు మస్క్, ట్రంప్‌ల మధ్య చీలికలు తెచ్చాయి. అందులో ప్రధానమైనది దేశీయ విధాన బిల్లు. ట్రంప్‌ కొనియాడిన ఈ బిల్లును మస్క్‌ బహిరంగంగా విమర్శించారు. ట్రిలియన్‌ డాలర్ల పన్ను మినహా యింపులవల్ల ప్రభుత్వ ఖర్చులు పెరుగుతాయని మస్క్‌ తెలిపారు. నిధులు తగ్గించే డోజ్‌ పనికి ఇది విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.

వ్యాపార ప్రయోజనాలకు దెబ్బ..
అయితే బిల్లు మస్క్‌ వ్యాపార ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపడమే ప్రధాన కారణం. మస్క్‌ సంస్థ టెస్లా ఎలక్ట్రిక్‌ వాహనాలకు 7,500 డాలర్ల పన్ను మినహాయింపును తొలగిస్తుంది. అంతేకాదు.. అదనంగా ప్రతిపాదించిన వార్షిక ఈవీ రిజిస్ట్రేషన్‌ రుసుము అతని ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. మస్క్‌ అమెరికా ప్రభుత్వంలోని డోజ్‌ సారథ్య బాధ్యతలు తీసుకున్న తరువాత.. ఉద్యోగాల నుంచి తొలగింపు, నిధుల కోతలపై ఆగ్రహంతో ఉద్యోగులతో పాటు పలువురు  టెస్లా బహిష్కరణకు  పిలుపు నివ్వడం తెలిసిందే. డోజ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అనేకచోట్ల  వాహనాలు, ఛార్జింగ్‌ స్టేషన్ల విధ్వంసం జరిగింది. దీంతో 2025 మొదటి త్రైమాసికంలో టెస్లా అమ్మకాలు 13% తగ్గాయి. దీంతో మొదటి త్రైమాసిక లాభాలు 71% తగ్గాయి. 

కేబినెట్‌తో ఉద్రిక్తతలు.. 
నిజానికి ట్రంప్‌ కేబినెట్‌కు మస్క్‌ మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. మార్చిలో లక్షలాది మంది ఫెడరల్‌ ఉద్యోగులకు మస్క్‌ ఇమెయిల్‌ పంపడాన్ని ఎఫ్‌బీఐ, స్టేట్‌ డిపార్ట్‌మెంట్, పెంటగాన్‌ విభేదించాయి. మస్క్‌ తన అధికారాన్ని అతిక్రమిస్తున్నారని, ఇమెయిల్‌కు సమాధానం ఇవ్వవద్దని తమ ఉద్యోగులకు సూచించాయి. ఆ తరువాత విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, మస్క్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలతో ట్రంప్, మస్క్‌ మధ్య అంతరం పెరిగింది. ఈ సంక్షోభం ఉన్నప్పటికీ ఫెడరల్‌ ఖర్చులను 2 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 150 బిలియన్లకు తగ్గించారు. ట్రంప్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నాకే డోజ్‌ సారథ్యం నుంచి నిష్క్రమించబోతున్నానని మస్క్‌ చెప్పుకొచ్చినా.. ప్రభుత్వంలో ఎదురైనా చేదు అనుభవాలు మస్క్‌ను ఇబ్బంది పెట్టాయి.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)