Breaking News

పాక్ ఎన్నికల్లో 26/11 సూత్రధారి స్థాపించిన పార్టీ

Published on Mon, 12/25/2023 - 19:31

ఇస్లామాబాద్: 26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (PMML) పాకిస్థాన్‌లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనుంది. పార్టీ తమ అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు సమాచారం. హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా పోటీలో ఉన్నాడు. నేషనల్ అసెంబ్లీ నియోజకవర్గం NA-127 లాహోర్ నుంచి బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. 

ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా గుర్తించిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్. అనేక ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో దోషిగా తేలడంతో 2019 నుంచి హఫీజ్‌ సయీద్ జైలులో ఉన్నాడు. సయీద్‌పై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది. నిషేధిత జమాత్-ఉద్-దవా (JuD)లష్కరే తోయిబా (LeT)కు చెందిన సంస్థ. 2008 నాటి ముంబయి పేలుళ్లకు ఈ సంస్థే బాధ్యత వహిస్తుంది. ఈ సంస్థకు హఫీజ్ సయీద్ నాయకత్వం వహించాడు.  

పీఎంఎంఎల్ ఎన్నికల గుర్తు కుర్చీ. తమ పార్టీ జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని  పీఎంఎంఎల్ అధ్యక్షుడు ఖలీద్ మసూద్ సింధు ఒక వీడియో సందేశంలో తెలిపారు. అవినీతి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయడమే ధ్యేయమని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను ఇస్లామిక్ సంక్షేమ రాజ్యంగా మార్చాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా.. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ఖలీద్ మసూద్ పోటీ చేయనున్నారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 

ఇదీ చదవండి: Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..!


 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)