Breaking News

పాక్‌లో "లవు"ని ఆలయం పునఃప్రారంభం

Published on Tue, 01/27/2026 - 23:51

పాకిస్థాన్‌లోని సాంస్కృతిక వారసత్వ కట్టడాల పరిరక్షణకు అక్కడి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా అక్కడి లాహెర్‌కోట లోని శ్రీ రామచంద్రుడి కుమారుడి లోహ్ ఆలయాన్ని పునరుద్ధరించి భక్తుల సందర్శనార్థం పున:ప్రారంభించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు తెలిపారు.

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో లాహోర్ కోటలో  చారిత్రక లోహ్ మందిరాన్ని వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ (WCLA), ఆగా ఖాన్ కల్చరల్ సర్వీస్ – పాకిస్థాన్ సహకారంతో పునరుద్ధరించారు. ఈ దేవాలయం శ్రీరాముడి ఇద్దరు కుమారుల్లో ఒకరైన లవుడికి సంబంధించిందిగా భక్తులు విశ్వసిస్తారు.  దీనికి 2018లో కొంతమేర మరమ్మత్తులు జరుపగా ఇప్పుడు పూర్తిస్తాయిలో పునరుద్ధరించారు.అయితే  హిందూ సంప్రదాయం ప్రకారం, లాహోర్ నగరానికి లవుడి పేరు మీద ఆ పేరు వచ్చిందని ప్రజలు విశ్వసిస్తారు.  

చారిత్రక లాహోర్ కోటలో కనిపించే సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు హిందూ దేవాలయాలు, సిక్కులకు చెందిన  నిర్మాణాలు, మొఘల్ మసీదులు, బ్రిటిష్ కాలపు కట్టడాలు—ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ ఈ కార్యక్రమం చేపట్టింది.  ఇటీవల లాహెర్ కోటను పర్యవేక్షించిన ఓ సిక్కు ట్రావెలర్ సిక్కుల పాలన కాలంలో లాహోర్ కోటలో సంరక్షించబడిన సుమారు 100 చారిత్రక స్మారక కట్టడాలను గుర్తించారు. 

దీంతో లాహోర్ కోటకు సిక్కు సామ్రాజ్య కాలంలో ఉన్న చారిత్రక విలువను సమగ్రంగా ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ (WCLA) అమెరికాకు చెందిన  సిక్కు పరిశోధకుడు డా. తరుంజీత్ సింగ్ బుటాలియాను నియమించి “Lahore Fort during the Sikh Empire” అనే పేరుతో ఒక టూర్ గైడ్ పుస్తకాన్ని రచించారు.

#

Tags : 1

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు