Breaking News

‘పైలట్లపైకి తోసేస్తారా?’.. అమెరికా సంస్థ ఆగ్రహం

Published on Thu, 01/22/2026 - 08:22

వాషింగ్టన్‌: గత ఏడాది(2025) జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమాన ప్రమాదంపై అమెరికాకు చెందిన ‘ఫౌండేషన్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీ’ (ఎఫ్‌ఏఎస్‌) సంచలన విషయాలను వెల్లడించింది. ఈ ప్రమాదానికి గురైన విమానం (రిజిస్ట్రేషన్ VT-ANB) సర్వీసులో చేరక ముందు నుంచే లెక్కలేనన్ని సాంకేతిక లోపాలతో సతమతమవుతున్నదని ఆ సంస్థ ఆరోపించింది.

ఎయిర్ ఇండియాలో ఈ విమానం సేవలు ప్రారంభించిన తొలి రోజు (2024, ఫిబ్రవరి 1) నుంచే సిస్టమ్ వైఫల్యాలు నమోదయ్యాయని ఎఫ్‌ఏఎస్‌ పేర్కొంది. ఈ విమానం తయారీ, ఇంజనీరింగ్, నాణ్యతా ప్రమాణాల్లో అనేక లోపాలు ఉన్నాయని, ఇవే ఈ ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని ఆ సంస్థ అంచనా వేసింది. గత 11 ఏళ్లుగా ఈ విమానంలో ఎలక్ట్రానిక్, సాఫ్ట్‌వేర్ లోపాలు, వైరింగ్ డ్యామేజ్, పవర్ సిస్టమ్ వేడెక్కడం లాంటి సమస్యలు నిరంతరం తలెత్తుతూనే ఉన్నాయని ఎఫ్‌ఏఎస్‌ నివేదిక స్పష్టం చేసింది.

2022, జనవరి 2022లో ‘పి100 ప్రైమరీ పవర్ ప్యానెల్’లో మంటలు చెలరేగడంతో కీలకమైన విద్యుత్ పంపిణీ వ్యవస్థ దెబ్బతిన్నదని, 2022, ఏప్రిల్‌లో ల్యాండింగ్ గేర్ ఇండికేషన్ సిస్టమ్ లోపాలతో విమానాన్ని గ్రౌండ్ చేయాల్సి వచ్చిందని ఎఫ్‌ఏఎస్‌ పేర్కొంది. ఈ లోపాలను సరిదిద్దేందుకు పలుమార్లు విడిభాగాలను మార్చాల్సి వచ్చిందని, అయినప్పటికీ సమస్యలు పునరావృతమయ్యాయని ఆరోపించింది. ఈ విమానమే కాకుండా, ఇతర ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానాల్లోనూ ఇలాంటి విద్యుత్ వైఫల్యాలు ఉన్నాయని ఎఫ్‌ఏఎస్‌ హెచ్చరించింది.

ఈ ప్రమాదంపై భారతీయ ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో పైలట్లదే తప్పని సూచించడాన్ని ఎఫ్‌ఏఎస్‌ తప్పుబట్టింది. గతంలో బోయింగ్ 737 మ్యాక్స్ ప్రమాదాల సమయంలోనూ సంస్థ ఇలాగే పైలట్లపై నిందలు వేసే వ్యూహాన్ని అనుసరించిందని గుర్తు చేసింది. బోయింగ్ 787 ప్రోగ్రామ్ షెడ్యూల్ కంటే మూడేళ్లు ఆలస్యంగా, బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చుతో నడిచిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,235 విమానాల్లో సుమారు 18 శాతం విమానాల రిపోర్టులను తాము విశ్లేషించామని ఎఫ్‌ఏఎస్‌ తెలిపింది. కాగా ఈ ఆరోపణలపై స్పందించేందుకు బోయింగ్ ప్రతినిధి నిరాకరిస్తూ, విచారణ బాధ్యతను ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం భారతీయ ఏఏఐబీకే వదిలేశామన్నారు. ఈ వ్యవహారంపై అమెరికా అధికారులు తక్షణమే క్రిమినల్ విచారణ జరిపించాలని ఎఫ్‌ఏఎస్‌ డిమాండ్ చేసింది.

ఇది కూడా చదవండి: ఇదేం సినిమా కాదు.. ఈ లక్షణాలే ప్రాణాంతకం
 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)