Bangladesh Crisis: అది స్వయం కృతాపరాధం: తస్లీమా నస్రీన్‌

Published on Tue, 08/06/2024 - 11:00

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల మధ్య  ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడం, తరువాత ఆమె ఆ దేశాన్ని విడిచిపెట్టడం సంచలనంగా మారింది. బంగ్లాదేశ్ సంక్షోభంపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్  స్పందించారు. షేక్ హసీనా బంగ్లాదేశ్‌ విడిచి భారత్‌లో ఆశ్రయం పొందడం విడ్డూరంగా ఉందన్నారు. ఇస్లాంవాదులను ప్రసన్నం చేసుకునేందుకే హసీనా బంగ్లాదేశ్ నుంచి బయటపడ్డారని, ఆమె కూడా విద్యార్థి ఉద్యమంలో భాగమైనట్లు ఉన్నదని తస్లీమా ఆరోపించారు.

తస్లీమా నస్రీన్ ఒక ఆన్‌లైన్ పోస్ట్‌లో ‘ఇస్లామిస్టులను ప్రసన్నం చేసుకునేందుకు, హసీనా నన్ను 1999లో నా దేశం నుంచి వెళ్లగొట్టారు.  అప్పట్లో నేను మరణశయ్యపై ఉన్న మా అమ్మను చూసేందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లాను.  ఆ తరువాత నన్ను తిరిగి బంగ్లాదేశ్‌కు రానివ్వలేదు. ఒకవిధంగా చూస్తే ఆమె ఇస్లామిస్టు ఉద్యమంలో భాగమయ్యారు. అదే ఇప్పుడు ఆమెను దేశం విడిచివెళ్లేలా చేసింది’ అని అన్నారు. షేక్ హసీనా మిలటరీ విమానంలో భారతదేశానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె ఆశ్రయం పొందేందుకు లండన్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. ఇస్లాంవాదులకు మద్దతుగా నిలిచేందుకు, అవినీతికి పాల్పడే వ్యక్తులకు ఆమె ప్రోత్సాహం అందించారని’  తస్లీమా ఆరోపించారు.

తస్లీమా నస్రీన్ 1994లో ‘లజ్జ’ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. దీనిపై మత ఛాందసవాద సంస్థల నుండి వచ్చిన బెదిరింపుల కారణంగా ఆమె బంగ్లాదేశ్ విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఈ పుస్తకాన్ని బంగ్లాదేశ్‌లో నిషేధించారు. అయితే చాలా ప్రాంతాల్లో ఈ బుక్‌ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. తస్లీమా నస్రీన్‌ దేశం విడిచి వెళ్లిన సమయంలో హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్నారు. నాటి నుంచి రచయిత తస్లీమా నస్రీన్‌ బంగ్లాదేశ్‌కు దూరంగా ఉన్నారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)