Breaking News

ఉగ్రవాదుల్ని భారత్‌కు అప్పగిస్తావా?.. నువ్వెలా ప్రకటిస్తావ్‌?

Published on Sun, 07/06/2025 - 20:56

కరాచీ:  ఇరుదేశాల మధ్య నమ్మకాన్ని చూరగొనే ప్రక్రియలో భాగంగా ఉగ్రవాదులు హఫీజ్‌ సయ్యద్‌, మసూద్‌ అజహర్‌లను భారత్‌కు అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌ మాజీ విదేశాంగమంత్రి, పీపీపీ  నాయకుడు బిలావల్‌ భుట్టో వ్యాఖ్యలు ఇప్పుడు ఆ దేశంలో కలకలం రేపుతున్నాయి. గత శుక్రవారం ఖతార్‌కు చెందిన ఆల్‌ జజీర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ ప్రక్రియలో భాగంగా ఒకవేళ భారత్‌ ఆ ఉగ్రవాదుల్ని అప్పగించాలని కోరితే తాము అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బిలావాల్‌.

లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) మరియు జైషే మొహమ్మద్ (జెఎం) చీఫ్ మసూద్ అజార్‌ను అప్పగించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ లో ఉగ్రవాదమే తీవ్ర అంశంగా మారిన సమయంలో భారత్‌తో  నమ్మకాన్ని చూరగొనడానికి ఇదొక మార్గమన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్‌ ఎటువంటి అభ్యంతరం చెప‍్పదని పాకిస్తాన్‌ పీపుల్స్ పార్టీ చైర్మన్‌ బిలావాల్‌ స్పష్టం చేశారు. 

ఉగ్రవాద కార్యకలాపాలు భారత్‌లో నిర్వహించారని ఆరోపణలు నేపథ్యంలో వారిని అప్పగిస్తామని, అందుకు సంబంధించిన న్యాయప్రక్రియకు భారత్‌ సహకరించాలన్నారు.

 ఇందుకు భారత్‌ ప్రభుత్వం సహకరిస్తే, పాకిస్తాన్‌ నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదన్నారు.  భారత్‌ ఆందోళన చెందుతున్న సంబంధిత వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలు చేశారని ప్రకటనగా మాత్రమే ఉందని, ఈ క్రమంలో భారత్‌ సహకరించి న్యాయపరంగా ముందుకు వెళతామంటే వారిని(సంబంధిత ఉగ్రవాదుల్ని) భారత్‌కు అప్పగిస్తామన్నారు.

నున్వెలా ప్రకటిస్తావ్‌!
బిలావల్‌ భుట్టో ప్రకటనపై  ఉగ్రవాది హఫీజ్‌ సయ్యద్‌ కుమారుడు తల్హా సయీద్‌ తీవ్రంగా మండిపడ్డారు.  బిలావాల్‌ ఆ ప్రకటన ఎలా ఇస్తారంటూ ధ్వజమెత్తారు ఇది అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ పరువు తీసినట్లేనని తల్హా విమర్శించారు. ఈ విషయంలో బిలావాలో అప్పగింత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)