Breaking News

తైవాన్ చుట్టూ చైనా సైనిక కదలికలు..

Published on Sun, 01/18/2026 - 00:50

తైవాన్ చుట్టూ చైనా సైనిక ఉనికి మరింత పెరుగుతోంది. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల వరకు తైవాన్ ప్రాదేశిక జలాల సమీపంలో 26 చైనా సైనిక విమానాలు, ఎనిమిది నావికాదళ నౌకలు, ఒక ప్రభుత్వ నౌకను గుర్తించారు.

ఈ 26 విమానాల్లో ఏడు విమానాలు సెంట్రల్ లైన్‌ను దాటి  తైవాన్ ఉత్తర, మధ్య, నైరుతి ఎయిర్ డిఫెన్స్ జోన్‌లలోకి ప్రవేశించాయి. ఇదే సమయంలో, చైనా సైన్యానికి చెందిన ఒక నిఘా మానవరహిత వైమానిక వాహనం (డ్రోన్) కూడా తైవాన్ నైరుతి రక్షణ జోన్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు.

తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ రేడియో హెచ్చరికలు జారీ చేసిన అనంతరం, ఆ డ్రోన్ సంఘటనా స్థలం నుంచి వెనక్కి వెళ్లిందని పేర్కొంది. ఈ డ్రోన్ తైవాన్ నియంత్రణలో ఉన్న ప్రాటాస్ దీవుల మీదుగా ఎగిరినట్లు వెల్లడించింది. ఈ చర్యను తైవాన్ రక్షణ శాఖ రెచ్చగొట్టే, బాధ్యతారాహిత్య చర్యగా అభివర్ణించింది.

శుక్రవారం కూడా తైవాన్ చుట్టూ చైనా సైనిక కదలికలు తీవ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు మొత్తం 34 చైనా విమానాలు, 11 నౌకలు గుర్తించినట్లు జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ నివేదించింది. వీటిలో 18 విమానాలు సెంటర్ లైన్‌ను దాటి తైవాన్ ఉత్తర, మధ్య, నైరుతి, తూర్పు ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ADIZ)లోకి ప్రవేశించాయని పేర్కొంది.

చైనా సైనిక చర్యల నేపథ్యంలో తైవాన్ భద్రతాపరమైన పరిస్థితులపై ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)