Breaking News

చైనాకు చేయి అందించి సాయం చేస్తానన్న తైవాన్‌! విస్తుపోయిన బీజింగ్‌

Published on Sun, 01/01/2023 - 18:28

చైనాలో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఆంక్షలు సడలించాకే కనీవినీ ఎరుగని స్థాయిలో కేసులు పెరిగిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐతే ఇలాంటి మహమ్మారి పరిస్థితుల్లో చైనాకు ఆపన్నహస్తం అందించి సాయం చేస్తానంటూ ముందుకు వచ్చింది తైవాన్‌. ఈ మేరకు తైవాన్‌ అధ్యక్షుడు సాయ్‌ ఇంగ్‌ వెన్‌ ఆదివారం భారీగా పెరుతున్న కరోనా కేసులను కట్టడి చేయడంలో చైనాకు అవసరమైన సాయాన్ని అందిస్తానని ప్రకటించారు.

ఈ కొత్త ఏడాదిలో మావనతా దృక్పథంతో మహమ్మారీ నుంచి ఎక్కువ మంది చైనా ప్రజలు బయటపడి ఆరోగ్యకరమైన జీవనం సాగించేలా అవసరమైన సాయం అందించేందుకు తాము సదా సిద్ధంగా ఉన్నామని ఇంగ్‌ వెన్‌ చెప్పారు. అలాగే సమస్యలను పరిష్కరించడానికి యుద్ధం ఒక ఎంపిక కాదంటూ చైనాతో చర్చలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ద్వీప సమీపంలో చైనా సైనిక కార్యకలాపాలు చాలా ఉద్రిక్తంగా ఉన్నయని, శాంతి స్థిరత్వానికి భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ.. ఆవేదన చెందారు. 

ఇదిలా ఉండగా, చైనా అద్యక్షుడు జిన్‌పింగ్‌ నూతన సంవత్సరం ప్రసంగంలో తైవాన్‌ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలు ఒకే కుటుంబానికి చెందినవారు అంటూ ప్రసంగించారు. ఐతే కోవిడ్‌ వ్యాప్తిని నియంత్రించడంలో గతంలో తైవాన్, చైనా దేశాలు తమ చర్యలపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది మహమ్మారి విషయంలో తైవాన్‌ సమర్థవంతంగా పనిచేయలేదంటూ చైనా విమర్శించగా,.. మరోవైపు తైవాన్‌ చైనాలో పారదర్శకత లోపించిందని, తమ దేశానికి సరఫరా చేసే వ్యాక్సిన్‌లలో జోక్యం చేసుకుందంటూ మండిపడింది. ఐతే బీజింగ్‌ తైవాన్‌ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. 

(చదవండి: చైనాలో తమిళనాడు యువకుడు మృతి.. సాయం కోసం కుటుంబం వేడుకోలు)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)