Breaking News

ఈ సూర్యుడికి సడన్‌గా ఏమైంది?

Published on Mon, 12/22/2025 - 07:20

ఈ సూర్యుడికి సడన్‌గా ఏమైంది?.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో చూసి చాలామంది వేస్తున్న ప్రశ్న ఇది. సూర్యుడి చుట్టూ ప్రకాశవంతమైన వలయం ఏర్పడి.. రంగుల కాంతి చుక్కలు, ఇంద్రధనుస్సు వలె మెరుస్తూ కనిపించిన దృశ్యం.. వావ్‌ అనిపిస్తోంది. అయితే.. అది రెయిన్‌బో ఏమాత్రం కాదు. 

ఈ అద్భుత దృశ్యం కనిపించింది స్వీడన్‌ జామ్‌ట్లాండ్‌లో. శాస్త్రవేత్తలు దీనిని సన్ హాలో అని పిలుస్తారు. సూర్యుడి చుట్టూ 22 డిగ్రీల వ్యాసార్థంతో ఇది ఏర్పడుతుంది. ఇది ఎక్కువగా చల్లని ప్రాంతాల్లో.. అందునా శీతాకాలంలో సూర్యుడు ఆకాశంలో తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ హాలో ఏర్పడటానికి కారణం.. ఆకాశంలో 5–10 కి.మీ ఎత్తులో ఏర్పడే సిరస్ మేఘాలు. వీటిలో ఉండే చిన్న హెక్సగాన్ ఆకారపు మంచు స్ఫటికాలు సూర్యకిరణాలు తాకి 22 డిగ్రీల కోణంలో వంగిపోతాయి. అలా.. లక్షలాది కిరణాలు ఒకే విధంగా వంగి కలిసిపోవడం వల్ల సూర్యుడి చుట్టూ ప్రకాశవంతమైన వలయం ఏర్పడుతుంది. అలా ఆరెంజ్‌, ఎల్లో, గ్రీన్‌, బ్లూ, పర్‌పుల్‌ రంగులు బయటకు విస్తరిస్తూ ఇంద్రధనుస్సు వలె మెరుస్తాయి. అదే సమయంలో.. 

సన్ డాగ్స్/పార్హీలియా అనే ప్రకాశవంతమైన చుక్కలు సూర్యుడి రెండు వైపులా ఏర్పడి ఆకాశాన్ని అందంగా మార్చుతుంది. టాంగెంట్ ఆర్క్స్.. హాలో పైభాగంలో వంగిన కాంతి రేఖలు, సర్కంహొరిజాంటల్ ఆర్క్స్.. ఇంద్రధనుస్సు వలె అడ్డంగా కనిపించే కాంతి రేఖలు కూడా ఉంటాయి.  సో.. ఇదేం మాయా జాలం కాదు, పూర్తిగా సైన్స్‌(ఫిజిక్స్‌). అయినా కూడా నెటిజన్స్‌ సూర్యుడికి ప్రకృతి తొడిగిన కిరీటం అని అభివర్ణిస్తున్నారు. 

హాలోకి.. ఇంద్రధనుస్సు బోలెడు తేడా ఉంది. ఇంద్రధనుస్సు వర్షపు నీటి బిందువుల వల్ల ఏర్పడుతుంది. కానీ హాలో మంచు స్ఫటికాల వల్ల ఏర్పడుతుంది. హాలోలు అర్కిటిక్‌ ప్రాంతాలు, స్కాండినేవియా, హిమాలయాలు వంటి చల్లని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఉష్ణమండల ప్రాంతాల్లో సిరస్‌ మేఘాలు ఏర్పడడం తక్కువ కాబట్టి చాలా అరుదుగా కనిపించొచ్చు. 

కొన్ని దేశాల సంస్కృతుల్లో సన్‌ హాలోను దైవ సంకేతంగా భావిస్తారు. మరికొన్ని దేశాల్లో శుభసూచకంగా చూస్తారు. చైనాలో మాత్రం వాతావరణ మార్పు సూచనగా చూస్తారు. హాలోలు కనిపించడం అంటే వాతావరణంలో తేమ పెరుగుతోందని.. త్వరలో వర్షం లేదంటే మంచు కురిసే అవకాశం ఉందని సంకేతాం అన్నమాట. 

సూర్యుడి విషయంలోనే కాదు.. చంద్రుడి విషయంలోనూ ఇలా జరుగుతుంది. సూర్యుడి స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు, అదే విధంగా మంచు స్ఫటికాల వల్ల చంద్రుడి చుట్టూ ఇదే తరహాలో వలయం ఏర్పడుతుంది.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)