బంగ్లాలో మళ్లీ ఘర్షణలు: 97 మంది మృతి

Published on Mon, 08/05/2024 - 05:50

ఢాకా: బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు, విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం తొలిరోజే హింసాత్మకంగా మారింది. అధికార ఆవామీ పార్టీ కార్యకర్తలకు, ఆందోళకారులకు మధ్య ఆదివారం దేశవ్యాప్తంగా 13 జిల్లాల్లో జరిగిన ఘర్షణల్లో ఏకంగా 97 మంది మరణించారు. ఆందోళనల ధాటికి రాజధాని ఢాకాలో దుకాణాలు మూతబడ్డాయి. 

షాబాగ్‌లో వేలాది మంది విద్యార్థులు తదితరులు గుమికూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు బంగాబంధు షేక్‌ ముజీబ్‌ మెడికల్‌ కాలేజీలో వీరంగం సృష్టించారు. వాహనాలను తగలబెట్టారు. దాంతో రోగులు, వైద్యులు, విద్యార్థులు భయంతో వణికిపోయారు. దేశ విమోచన పోరాట అమరుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను తగ్గించాలంటూ యువత, ఆందోళనకారులు ఇటీవల చేపట్టిన భారీ ఆందోళనల్లో 200కు పైగా చనిపోవడం తెలిసిందే. 

అందుకు బాధ్యత వహిస్తూ హసీనా గద్దె దిగాలంటూ నిరసనకారులు తాజాగా మళ్లీ ఉద్యమబాట పట్టారు. దాంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఫేస్‌బుక్, వాట్సప్, మెసేంజర్, ఇన్‌స్ట్రాగాం సేవలను నిలిపేశారు. 4జీ ఇంటర్నెట్‌ సేవలను కూడా నిలిపేయాలని మొబైల్‌ ఆపరేటర్లను ఆదేశించారు. ఉద్యమం చేస్తున్న వారిలో యువత లేరని, ఉగ్రవాదులే ఉన్నారని హసీనా ఆరోపించారు. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాజా పరిస్థితిపై ఆర్మీ, పోలీసు విభాగాల అధిపతులతో ఆమె సమీక్ష జరిపారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామంటూ నిరుద్యోగులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం, వారు తిరస్కరించడం తెల్సిందే. 

రాజుకున్న చిచ్చు... 
బంగ్లాదేశ్‌ విముక్తి యోధుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల నిర్ణయం ఇటీవల బంగ్లాలో చిచ్చు రేపడం తెలిసిందే. దాంతో సుప్రీంకోర్టు వాటిని 5 శాతానికి తగ్గించింది. 
 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)