Breaking News

తుపాను బీభత్సం : కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ

Published on Tue, 12/16/2025 - 11:33

దక్షిణ బ్రెజిల్‌లోని గువైబా నగరంలో తీవ్ర తుఫాన్ బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు, తుఫాన్‌ తాకిడికి దాదాపు 114 అడుగుల ఎత్తున్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కుప్పకూలిపోయింది.అయితే అదృష్టవశాత్తూ  ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌ బాగా షేర్‌ అవుతోంది. 

సోమవారం మధ్యాహ్నం బ్రెజిల్‌లోని గుయిబా నగరాన్ని తీవ్రమైన తుఫాను ముంచెత్తింది. దీంతో దాదాపు 40 మీటర్ల పొడవైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కూలిపోయింది. ఫాస్ట్-ఫుడ్ అవుట్‌లెట్ సమీపంలోని హవాన్ రిటైల్ మెగాస్టోర్ ,కార్ పార్కింగ్‌లో ఏర్పాటు చేయబడినఈ విగ్రహాన్ని తీవ్రమైన గాలులు తాకాయి. బలమైన గాలుల ధాటికి  తొలుత వంగిపోయిన ఈ విగ్రహం తాకిడి తీవ్రం కావడంతో  స్టాట్యూ తల ముక్కలైంది. 

బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ అధికారుల ప్రకారం.. పై భాగం మాత్రమే ప్రభావితమైది. అయితే 11 మీటర్లు (36 అడుగులు) పీఠం చెక్కుచెదరకుండా ఉంది. గుయిబా మేయర్ మార్సెలో మారనాటా మాట్లాడుతూ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. సత్వరమే స్పందించిన అధికారులను ప్రశంసించారు. విగ్రహం కూలిపోవడానికి ఖచ్చితమైన కారణాన్నిగుర్తించేందుకు, తీవ్రమైన వాతావరణం తోపాటు, తర అంశాలు పాత్రపై ఆరా తీసేందుకు  సాంకేతిక తనిఖీ నిర్వహించబడుతుందని  అధికారి ఒకరు చెప్పారు.

ఇదీ చదవండి:  బోండీ బీచ్‌ హీరోకు సర్వత్రా ప్రశంసలు : భారీగా విరాళాలు

గుయిబాలో తుఫాను రియో గ్రాండే డో సుల్‌ను కూడా చాలా వరకు ప్రభావితం చేసింది. వడగళ్ల వాన, పైకప్పులు, చెట్లు, కూలిపోవడం, తాత్కాలిక విద్యుత్తు అంతరాయం లాంటి సంఘటనలు చోటు చేసు కున్నాయి. భారీ వర్షం కారణంగా కొన్ని వీధులు జలమయమయ్యాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటియాలజీ తుఫాను హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. చలిగాలులే  దీనికి కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి వర్షం ఉన్నప్పటికీ మంగళ వారం నుండి వాతావరణ పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు. 

కాగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అసలైన విగ్రహం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. బ్రెజిల్‌లోని హవాన్ అనే డిపార్ట్‌మెంటల్ స్టోర్ చైన్ బ్రాండ్ గుర్తుగా  2020లో దీన్ని ఏర్పాటు చేశారు..

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)