Breaking News

చెప్పుకోవడానికే బలమైన దేశం.. చేతల్లో ఏమీ లేదు: జెలెన్ స్కీ

Published on Sat, 04/05/2025 - 20:30

రష్యా ఉక్రెయిన్ ల శాంతి ఒప్పందం(కాల్పుల విరమణ ఒప్పంద)  ఇక కార్యరూపం దాల్చేలా లేదు. ఇందుకు అమెరికా చేసిన మధ్యవర్తిత్వం ఇప్పటికే గాడి తప్పింది.  ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందానికి ససేమేరా అంటున్న రష్యా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినా దానిని పెడ చెవినే పెట్టింది. ఈ విషయంలో అమెరికా ఇప్పటికే చేతులెత్తేసినట్లే కనబడుతోంది.

తాజాగా అమెరికాను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేసిన వ్యాఖ్యలు ఉదాహరణగా చెప్పొచ్చు. అమెరికా చెప్పుకోవడానికే బలమైన.. కానీ చేతల్లో ఏమీ ఉండదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తమ దేశంపై మళ్లీ రష్యా విరుచుకుపడిన విషయాన్ని ఆమెరికాకు తెలియజేస్తే వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదన్నారు.  రష్యా జరిపిన మిసైళ్ల దాడిలో 20  మంది తమ దేశ పౌరులు చనిపోయిన విషయాన్ని యూఎస్ ఎంబాసీకి తెలిపానని, అయితే వారు రష్యా పేరు పలకడానికి కూడా భయపడుతునం‍్నారని ఎద్దేవా చేశారు. రష్యా చేసిన దాడిలో చాలా వరకూ చిన్న పిల్లలు ఉన్నారని, ఈ విషయాల్ని పలు దేశాల ఎంబాసీలకు తెలిపినట్లు జెలెన్ స్కీ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అమెరికాకు కూడా తెలిపితే. రష్యా పదాన్ని వారు పలకడానికి వణుకు పోతున్నారంటూ సెటైర్లు వేశాడు. మనం చెప్పుకోవడానికే బలమైన దేశం.. బలమైన ప్రజలు.. కానీ వారి యాక్షన్ లో మాత్రం ఏమీ పస ఉండదు’ అంటూ దెప్పిపొడిచారు జెలెన్ స్కీ.

జపాన్, యూకే, స్విట్జర్లాండ్, జర్మనీ తదితర దేశాల ఎంబాసీలకు తమ దేశంపై మళ్లీ జరిగిన దాడిని చెబితే.. వారి నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందని, అదే అమెరికాకు చెబితే చాలా నిరూత్సాహమైన సమాధానం చెప్పారన్నారు. తమ దేశంపై శుక్రవారం రష్యా జరిపిన మిసైళ్ల దాడిలో  11 మంది పెద్దవాళ్లు, 9 మంది చిన్నపిల్లలు ఉన్నారరన్నారు.  ఈ ఘటనలో 62 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారని జెలెన్ స్కీ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా తెలియజేశారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)