Breaking News

ఆరు వేల విద్యార్థి వీసాలు రద్దు

Published on Wed, 08/20/2025 - 05:41

వాషింగ్టన్‌: అమెరికా చట్టాలను మీరితే విద్యార్థి వీసాలను రద్దుచేయడం ఖాయమని గతంలోనే స్పష్టంచేసిన ట్రంప్‌ ప్రభుత్వం అన్నంతపనీ చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తూ, పలురకాల నేరాలకు పాల్పడినందుకు శిక్షగా ఇప్పటిదాకా 6,000 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఇతరులపై దాడులు, మద్యం సేవించి వాహనం నడపడం, చోరీలకు పాల్పడటం, ఉగ్రవాదానికి నైతిక మద్దతు పలకడం, ఇతరత్రా చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయిన అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్‌ వీసాలను రద్దుచేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

అమెరికా చట్టనిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈ ఆరువేల మందిలో దాదాపు 4వేల మంది వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 300 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. ‘ఇమిగ్రేషన్, నేషనల్‌ యాక్ట్‌లోని మూడో సెక్షన్‌ ప్రకారం ఉగ్రవాదానికి మద్దతు ప్చ్ఠ్డలికిన వారి వీసా రద్దు అవుతుంది. పాలస్తీనా అనుకూల, యూదు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న వారి వీసా రద్దు అవుతుంది.

ఉగ్రసంస్థకు అనుకూలంగా వ్యవహరించడం, అమెరికా పౌరులకు ప్రాణహాని కల్పించడం సైతం చట్టాన్ని ఉల్లంఘించే చర్యలుగా అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. జనవరి నుంచి వేలాది మంది విద్యార్థుల వీసాల అపాయింట్‌మెంట్‌ షెడ్యూలింగ్‌ను అర్థంతరంగా ట్రంప్‌ ప్రభుత్వం నిలిపివేయడం తెల్సిందే. జూన్‌లో మళ్లీ వీసాల అపాయింట్‌మెంట్లను పునరుద్ధరించినప్పటికీ అభ్యర్థులంతా తమ సోషల్‌మీడియా ఖాతాల వివరాలు అధికారులు తనిఖీ చేసేందుకు వీలుగా ‘పబ్లిక్‌’మోడ్‌లోనే ఉంచాలని సూచనలు చేయడం తెల్సిందే.

#

Tags : 1

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)