ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన...ఇక మా సారథ్యంలో: బ్రిటన్‌

Published on Tue, 03/04/2025 - 05:42

లండన్‌/కీవ్‌/వాషింగ్టన్‌: అమెరికాకు బదులుగా ఇకపై ప్రపంచ పెద్దన్న పాత్రను పోషించేందుకు బ్రిటన్‌ సిద్ధమవుతున్నట్టు కన్పిస్తోంది. రష్యాతో ఘర్షణకు తెర దించి ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇక బ్రిటన్‌ సారథ్యం వహిస్తుందని ఆ దేశ ప్రధాని కియర్‌ స్టార్మర్‌ ప్రకటించారు. అందుకోసం అవసరమైతే ఉక్రెయిన్‌కు సైనికంగా, ఆర్థికంగానే గాక అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని పునరుద్ఘాటించారు. 

‘‘ఈ ప్రయత్నాల్లో ఇతర దేశాలనూ కలుపుకుని సాగుతాం. ఇందుకు అమెరికా చాలా కీలకం’’ అని చెప్పారు. ఉక్రెయిన్‌ విషయమై స్టార్మర్‌ చొరవ తీసుకుని మరీ ఆదివారం యూరప్‌ దేశాలతో లండన్‌లో అత్యవసర భేటీ నిర్వహించడం తెలిసిందే. అందులో చర్చించిన అంశాలను సోమవారం ఆయన పార్లమెంటుకు వివరించారు. ఈ విషయంలో స్టార్మర్‌కు విపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించడం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ వాగ్యుద్ధం ఇబ్బందికర పరిణామాలకు దారి తీసిందని స్టార్మర్‌ అన్నారు. అగ్ర రాజ్యంతో పటిష్టమైన సంబంధాలు బ్రిటన్‌కు చాలా ముఖ్యమని చెప్పారు. 

అమెరికా భరించబోదు 
రష్యాతో ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కన్పించడం లేదంటూ జెలెన్‌స్కీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ఆ దిశగా ఒప్పందం ఇప్పటికైతే సుదూరంలోనే ఉందన్నారు. వీటిపై ట్రంప్‌ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘జెలెన్‌స్కీ చేసిన అత్యంత పనికిమాలిన ప్రకటన బహుశా ఇదే! ఆయనను అమెరికా ఇక ఎంతమాత్రమూ భరించబోదు’’ అని స్పష్టం చేశారు. ‘‘జెలెన్‌స్కీకి కావాల్సింది శాంతి కాదని మొదటినుంచీ చెప్తూనే ఉన్నా. అదే నిజమని మరోసారి తేలింది. అలాంటి వ్యక్తికి యూరప్‌ దేశాల సంఘీభావమా? అవి అసలు ఏమనుకుంటున్నాయి?’’ అంటూ మండిపడ్డారు. జెలెన్‌స్కీతో ట్రంప్‌ వాగ్యుద్ధం యాదృచ్ఛికమేమీ కాదని, పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని జర్మనీ కాబోయే చాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ అనుమానం వెలిబుచ్చారు.  
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)