Breaking News

Sri Lanka: ముస్లింలకు క్షమాపణ చెప్పిన శ్రీలంక

Published on Wed, 07/24/2024 - 07:59

కోవిడ్‌ సమయంలో ముస్లింల మనోభావాలు దెబ్బతీసినందుకు శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా వారికి క్షమాపణలు చెప్పింది. కరోనా బారినపడి మృతి చెందిన ముస్లింలను బలవంతంగా దహనం చేసినందుకు తమను క్షమించాలని, భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగబోవని ప్రభుత్వం ముస్లింలకు భరోసా ఇచ్చింది.

భవిష్యత్తులో ముస్లింలు లేదా మరే ఇతర కమ్యూనిటీ ప్రజలు అనుసరించే అంత్యక్రియల ఆచారాల విషయంలో ఉల్లంఘన జరగకుండా చూస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఖననం లేదా దహన సంస్కారాలకు సంబంధించిన విషయంలో కొత్త చట్టం హామీ ఇస్తుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని శ్రీలంక సభలోని ముస్లిం ప్రతినిధులు స్వాగతించారు. దేశ జనాభాలో ముస్లిం జనాభా 10 శాతం అని, కోవిడ్ కాలంలో జరిగిన ఘటనలపై ముస్లింలు ఇప్పటికీ ఆవేదన చెందుతున్నారని ముస్లిం ప్రతినిధులు పేర్కొన్నారు.

కోవిడ్ కాలంలో శ్రీలంక ప్రభుత్వం  కరోనా మృతులను ఖననం చేసేందుకు అనుమతించలేదు. దీనికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వం జారీ చేసిన  ఉత్తర్వును ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి కూడా విమర్శించింది. ముస్లింలు, కాథలిక్కులు, బౌద్ధుల మనోభావాలను గౌరవించడంలో శ్రీలంక ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు గతంలో వెల్లువెత్తాయి. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)