Breaking News

భారత్‌ సాయంతోనే సంక్షోభం నుంచి గట్టెక్కాం: శ్రీలంక

Published on Sun, 06/23/2024 - 07:40

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడిన  శ్రీలంక తాజాగా భారత్‌ను ప్రశంసించింది. భారత్‌- శ్రీలంకల  స్నేహపూర్వక సంబంధాలకు ఇది ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. తమ దేశం రెండేళ్ల పాటు ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిందని, భారత్‌ అందించిన 3.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయంతోనే ఇది సాధ్యమైందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు.

భారత్‌తో బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు  కట్టుబడి ఉంటామని  ఆయన అన్నారు. కొలంబోలో జరిగిన 31వ అఖిల భారత భాగస్వామ్య సమావేశంలో విక్రమసింఘే మాట్లాడుతూ ఇరు దేశాలూ పర్యావరణ అనుకూల ఇంధనరంగంలో కలిసి పనిచేస్తాయని అన్నారు. ఇటీవల తాను ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఉమ్మడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరాన్ని ప్రధాని మోదీతో చర్చించానన్నారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ ముందు పలు ప్రతిపాదనలు ఉంచినట్లు విక్రమసింఘే పేర్కొన్నారు. తమ దేశంలో సాంపూర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉందని, ఇది అంతర్-ప్రభుత్వ ప్రాజెక్ట్ అని, దీనిని జూలైలో  ప్రారంభించాలనుకుంటున్నామనారు. అలాగే శ్రీలంక-భారత్‌ల మధ్య ల్యాండ్‌ కనెక్టివిటీని నెలకొల్పే ప్రాజెక్టుపై కూడా తాము దృష్టి సారించామని తెలిపారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)