Breaking News

స్పెయిన్‌ చేతిలో ట్రోఫీ.. ట్రంప్‌ను ఆటాడుకున్నారు!

Published on Mon, 07/20/2026 - 10:24

ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో స్పెయిన్‌ చారిత్రక విజయం సాధించిన వేళ.. అసలు మ్యాచ్‌ కంటే ట్రోఫీ ప్రదానోత్సవమే ఎక్కువగా చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వేదికపైకి రావడం, ఆ తర్వాత ట్రోఫీ లిఫ్ట్‌ సమయంలో అక్కడే నిలబడిపోవడం సోషల్‌ మీడియాలో సెటైర్లకు కారణమైంది.

న్యూజెర్సీ: అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి స్పెయిన్‌ రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. మ్యాచ్‌ అనంతరం న్యూయార్క్‌–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవానికి ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోతో కలిసి ట్రంప్‌ మైదానంలోకి వచ్చారు. అయితే ట్రంప్‌ ఎంట్రీకి ప్రేక్షకుల్లోని ఓ వర్గం నుంచి భారీగా ‘బూస్‌’(నిరసన నినాదాలు) వినిపించాయి. కొద్దిసేపటికే ప్రేక్షకులు చల్లబడ్డా.. ఆ తర్వాత జరిగిన పరిణామం మాత్రం వైరల్‌గా మారింది.

ట్రోఫీ ఇచ్చి అలాగే.. 
స్పెయిన్‌ కెప్టెన్‌ రోడ్రికి ట్రంప్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీ అందించారు. సాధారణంగా ట్రోఫీ అందుకున్న కెప్టెన్‌ తన జట్టుతో కలిసి దానిని ఎత్తి సంబరాలు చేసుకుంటాడు. అదే సమయంలో ట్రంప్‌ అక్కడి నుంచి తప్పుకోవాల్సి ఉండగా.. కొద్దిసేపు ఆటగాళ్ల మధ్యే నిలబడి ఉన్నారు. దీంతో అధికారులు సంకేతాలు ఇవ్వడంతో ట్రంప్‌ పక్కకు జరిగారు. ఆ తర్వాత రోడ్రి తన సహచరులతో కలిసి ప్రపంచకప్‌ ట్రోఫీని పైకెత్తి ఘనంగా సంబరాలు చేసుకున్నారు.

ఈ చిన్న ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యాయి. ‘‘ట్రోఫీ ఇచ్చారు కానీ ఫోటోలో ఉండాలనుకున్నారు’’ అంటూ నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.

క్లబ్‌ వరల్డ్‌కప్‌ ఘటన గుర్తొచ్చిందా?
ఈ ఘటనపై గతంలో జరిగిన క్లబ్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ట్రోఫీ వేడుకను కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. అప్పట్లోనూ ట్రంప్‌ విజేత జట్టు ఆటగాళ్లతో కలిసి స్టేజ్‌పై ఎక్కువసేపు ఉండటంపై చర్చ జరిగింది. అయితే ఈసారి ఫిఫా ప్రోటోకాల్‌ ప్రకారం చివరకు ఆయన పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.

స్పెయిన్‌ చరిత్ర.. వేదికపై ట్రంప్‌ హైలైట్‌
ఇక ఫైనల్‌ మ్యాచ్‌లో ఫెర్రాన్‌ టోరెస్‌ అదనపు సమయంలో చేసిన గోల్‌తో స్పెయిన్‌కు విజయం దక్కింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్‌ రెడ్‌కార్డ్‌తో బయటకు వెళ్లడంతో ఆ జట్టు 10 మందితో మ్యాచ్‌ను ముగించింది. లియోనెల్‌ మెస్సీ వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ గెలవాలన్న కల నెరవేరలేదు. స్పెయిన్‌ ఆటగాళ్లు చరిత్ర సృష్టించిన రాత్రి.. ట్రోఫీ వేడుకలో ట్రంప్‌ ఎపిసోడ్‌ కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)