Breaking News

స్పెయిన్‌లో విజృంభిస్తున్న కార్చిచ్చు.. 3 వేల ఇళ్లు బుగ్గిపాలు!

Published on Mon, 07/17/2023 - 14:55

స్పెయిన్‌ దేశంలోని కెనరీ దీవుల్లోగల అడవుల్లో కార్చిచ్చు కలకలం రేపుతోంది. అగ్నికీలలు నియంత్రణ లేకుండా శరవేగంగా వ్యాపించడంతో.. సమీపంలో నివసిస్తున్న ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. శనివారం వరకు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ కార్చిచ్చు దాదాపు 11,000 ఎకరాల విస్తీర్ణం వరకు దీని మంటలు వ్యాపించాయని, పరిస్థితి మరింత దిగజారుతుందని అధికారులు చెప్పారు.


అధికారులు ఈ మంటలను ఆర్పేందుకు 10 హెలికాఫ్టర్‌ల సాయంతో తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ.. ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. కెనరీ దీవుల్లోని లా పాల్మా కొండపైన ఈ కార్చిచ్చు మొదలైంది. అక్కడ ఓ అగ్నిపర్వతం బద్దలవడమే ఈ కార్చిచ్చుకు ప్రధాన కారణం. దీని వలన ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే అనేక అరటి తోటలు, రోడ్లు, నీటిపారుదల వ్యవస్థలతో పాటు దాదాపు 3,000 భవనాలు బుగ్గిపాలైనట్లు అధికారులు అంచనా వేశారు.  

చెలరేగుతున్న అడవి మంటలు కారణంగా ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు కానరీ దీవుల ప్రాంతీయ అధ్యక్షుడు ఫెర్నాండో క్లావిజో చెప్పారు. కొందరు ప్రజలు తమ ఇళ్లను వీడేందుకు అంగీకరించలేదని.. వారు పరిస్థితిని అర్థం చేసుకుని, అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఎండ వేడిమిలో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని, అయితే తమ వంతు సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసినట్లు చెప్పుకొచ్చారు.

చదవండి: ‘పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం’.. ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వరుని స్టేట్‌మెంట్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)