Breaking News

దక్షిణ కొరియాలో ట్విస్ట్‌.. అధ్యక్ష ఆఫీసులో పోలీసుల సోదాలు

Published on Wed, 12/11/2024 - 09:32

సియోల్‌: దక్షిణ కొరియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి సంబంధించిన విషయాలను సేకరించేందుకు పోలీసులు తనిఖీలు చేపట్టినట్టు కొరియన్ టైమ్స్ తెలిపింది.

వివరాల ప్రకారం.. ఇటీవల దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. అనంతరం, దేశవ్యాప్తంగా రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు యూన్‌ మరో ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు యూన్‌పై దక్షిణ కొరియా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే అధ్యక్ష కార్యాలయంలో.. నేడు సియోల్ మెట్రోపాలిటన్ పోలీసులు, నేషనల్ అసెంబ్లీ పోలీస్ గార్డ్స్ సోదాలు చేశారు. అయితే, అధ్యక్ష కార్యాలయంపై పోలీసులు సోదాలు చేసిన సమయంలో యూన్‌ ఆఫీసులో లేరని కొరియన్‌ టైమ్స్‌ వెల్లడించింది.

ఇక, అంతకుముందు.. అంతకుముందు డిసెంబర్ 9న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. ఆయనపై దర్యాప్తు ప్రారంభించినందుకు గానూ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. మరోవైపు.. ఎమర్జెన్సీ ప్రకటనలో మాజీ రక్షణ మంత్రి కిమ్‌ యోంగ్‌ హ్యూన్‌ పాత్ర ఉందనే ఆనుమానంతో ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

చ‌ద‌వండి: ఐసిస్‌ ఉగ్రభూతం మళ్లీ విజృంభిస్తుందా?

ఇక, మార్షల్‌ లా ప్రకటన నేపథ్యంలో అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్, కిమ్‌ యోంగ్‌ హ్యూన్‌లను పదవుల నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే హ్యూన్‌ను పదవి నుంచి తప్పిస్తున్నట్లు దేశాధ్యక్షుడే ప్రకటించారు. ఆయన స్థానంలో చోయ్‌ బ్యూంగ్‌ హ్యూక్‌ను నియమించారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)