Breaking News

కొరియాలో కార్చిచ్చు 

Published on Thu, 03/27/2025 - 06:15

సియోల్‌: దక్షిణ కొరియాను కార్చిచ్చు అతలాకుతలం చేస్తోంది. దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైందిగా చెబుతున్న కార్చిచ్చు ధాటికి ఇప్పటికే 44,000 ఎకరాల పైచిలుకు అడవి కాలిపోయింది. 24 మంది మంటలకు బలవగా 26 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులే. నలుగురు సివిల్‌ సర్వెంట్లు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే 28 వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉయిసాంగ్‌ నగరంలో క్రీ.శ 618 నాటి పురాతన గౌన్సా బౌద్ధాలయాన్ని కూడా కార్చిచ్చు దగ్ధం చేసింది.

 ప్రావిన్స్‌లోని అతిపెద్ద దేవాలయాలలో ఇదొకటి. జోసన్‌ రాజవంశానికి చెందిన జాతీ య సంపదగా భావించే ఈ బౌద్ధ నిర్మాణ నిర్మాణం ఉత్సవ గంటతో పాటుగా నేలమట్టమైంది. ప్రభుత్వ నిధిగా గుర్తించిన రాతి బుద్ధుడితో సహా ఇక్కడి పలు కళాఖండాలను ముందే ఇతర ఆలయాలకు తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం సాంచియాంగ్‌ కౌంటీలో మొ దలైన మంటలు ఉయి సాంగ్‌కు వ్యాపించాయి. బలమైన, పొడి గాలుల కా రణంగా పొరుగు కౌంటీలైన అండాంగ్, చి యోంగ్సాంగ్, యోంగ్యాంగ్, యోంగ్డియో క్‌లకు మంటలు వ్యాపిస్తున్నాయి. 

జపాన్‌లోనూ: జపాన్‌లోనూ కార్చిచ్చు కొనసాగుతోంది. బలమైన గాలుల వల్ల మంటల్లో పశ్చిమ జపాన్‌ ప్రావిన్స్‌లోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒకాయామా, తమోనోలో వందల ఎకరాల్లో చెట్లు కాలిపోయాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)