Breaking News

లైవ్ మ్యూజిక్‌ షోలో పాడుతూ కుప్పకూలిన సింగర్.. 27 ఏళ్లకే..

Published on Sun, 03/12/2023 - 17:19

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాప్రికాకు చెందిన యువ ర్యాపర్, సాంగ్ రైటర్ కోస్టా టిచ్ లైవ్ మ్యూజిక్ షో చేస్తూ స్టేజీపైనే కుప్పకూలాడు. సెకన్ల వ్యవధిలో రెండుసార్లు పడిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు. కోస్టా టిచ్ మరణవార్తను అతని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. 27 ఏళ్లకే అతను చనిపోవడం తమ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిందని కన్నీటిపర్యంతమయ్యారు. తాము అత్యంత విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు భారమైన హృదయంతో చెప్పారు.

ఈ యువ ర్యాపర్ జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న 'అల్ట్రా సౌత్ ఆఫ్రికా మ్యూజిక్ ఫెస్టివల్‌'లో లైవ్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చాడు. ఈక్రమంలోనే పాట పాడుతూనే సడన్‌గా స్టేడీపై పడిపోయాడు. వెంటనే లేచి నిల్చున్నా.. మళ్లీ క్షణాల్లోనే కుప్పకూలాడు. ఇతర సింగర్లు వెంటనే అతనికి సాయం అందించారు. కానీ అతడు స్పృహలోకి రాలేదు. కాసేపటికే చనిపోయాడు.

అయితే కోస్టా టిచ్ మృతికి గల కారణాలపై మాత్రం స్పష్టత లేదు. ఆయన కుటుంబసభ్యులు కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఎంబాంబెలాకు చెందిన కోస్టా టిచ్ సింగర్‌గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇతని సాంగ్స్‌కు యూట్యూబ్‌లో 4.5కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అమెరికన్ ఆర్టిస్ట్ అకోన్‌తో కలిసి ఇటీవలే ఓ రీమిక్స్ కూడా చేశాడు.
చదవండి: నూలుపోగు లేకుండా వీధుల్లో హల్‌చల్‌.. వేరే గ్రహం నుంచి..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)