Breaking News

దక్షిణాఫ్రికా హాస్టల్‌లో కాల్పులు.. 11 మంది మృతి

Published on Sat, 12/06/2025 - 17:14

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో దారుణం జరిగింది. ఇక్కడి ప్రటోరియా సమీపంలో ఓ హాస్టల్‌లో జరిగిన కాల్పుల్లో 11 మంది మృతిచెందగా.. మరో 14 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు జొహన్నెస్‌బర్గ్ పోలీసులు తెలిపారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల బాలిక ఉన్నారు.

కాల్పులు జరిపిందెవరో స్పష్టంగా తెలియరాలేదని పోలీసు అధికారి అథ్లెండా మాథే తెలిపారు. మృతుల్లో 10 మంది అక్కడికక్కడే మృతిచెందారని, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని వివరించారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున 4.30 సమయంలో హాస్టల్‌కు వచ్చి, తుపాకులతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.

ఘటనాస్థలిలో మద్యం సీసాలు లభించినట్లు, దుండగులు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా.. ఐక్యరాజ్య సమితి(ఐరాస) 2023-24 నివేదిక ప్రకారం హత్యల రేటులో దక్షిణాఫ్రికా టాప్-10లో ఉంది. ఇక్కడ ప్రతి లక్ష మందికి గాను 45 మంది హత్యకు గురవుతున్నారు. రోజుకు సగటున 63 హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి.


 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)