Breaking News

South Africa: బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికులు మృతి

Published on Tue, 01/14/2025 - 07:54

దక్షిణాఫ్రికాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గనిలో చిక్కుకుని, 100 మంది కార్మికులు  మృతిచెందారని సమాచారం. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ కార్మికులంతా దక్షిణాఫ్రికాలోని ఒక బంగారు గనిలో అక్రమంగా పనులు చేస్తున్నారు.

గనిలో చిక్కుకున్న కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్మికులు నెలల తరబడి భూగర్భ గనిలో చిక్కుకున్నారని తెలిపింది. ఈ నేపధ్యంలోనే వారు మరణించారని పేర్కొంది. కాగా గనిలో చిక్కుకున్న  కార్మికులను రక్షించడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ,  విజయం సాధించలేకపోయారు.

మైనింగ్ ప్రభావిత కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ గ్రూప్ ప్రతినిధి సబెలో మ్ంగుని మీడియాతో మాట్లాడుతూ కొందరు గని కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని, వారి దగ్గర రెండు వీడియోలు లభ్యమయ్యాయన్నారు. ఆ వీడియోల్లో డజన్ల కొద్దీ మృతదేహాలు భూగర్భంలో గనిలో కనిపిస్తున్నాయన్నారు.

వాయువ్య ప్రావిన్స్‌లోని ఈ గనిలో 100 మంది వరకూ మృతిచెందారని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇప్పటివరకు భూగర్భ గనిలో నుంచి 18 మృతదేహాలను బయటకుతీశారు. వారు ఆకలి, డీహైడ్రేషన్‌ కారణంగా చనిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: మకర సంక్రాంతి వేళ.. అమృత స్నానానికి పోటెత్తిన జనం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)