Breaking News

పాపం పసివాడు:16 రోజులు కోమాలో ఉండి.. తల్లిని చూడగానే.. కంటతడి పెట్టిస్తున్న వీడియో!

Published on Tue, 06/27/2023 - 09:21

ఇది సోషల్‌ మీడియాలో అత్యంత వేగంగా వైరల్‌ అవుతున్న వీడియో. ఒక చిన్నపిల్లోడు తన తల్లితోపాటు ఆగకుండా రోదిస్తున్న దృశ్యం దీనిలో కనిపిస్తుంది. దీనిని చూసినవారంతా కంటతడి పెట్టుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ వీడియోలో ఒక తల్లి తన కుమారుడిని కలుసుకునేందుకు ఆసుపత్రికి వస్తుంటుంది. 16 రోజుల పాటు కోమాలో ఉన్న తన కుమారుడు ఇప్పడే మేలుకున్నాడని అమెకు తెలియడంతో పరుగుపరుగున వచ్చింది. పిల్లాడిని కావలించుకుని రోదించింది. ఆ పిల్లాడి పేరు గుడ్‌. ఆ పిల్లాడు పుట్టుకతోనే డిస్ట్రోఫిక్ ఎపిడెర్మోలిసిస్  అనే అరుదైన చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. 

ఈ వ్యాధి కారణంగా పిల్లాడు 16 రోజుల పాటు కోమాలోకి జారుకున్నాడు. కోమా నుంచి మేల్కొన్న తరువాత ముందుగా తల్లిని చూడాలని పరితపించాడు. వారిద్దరూ ఒకరిని ఒకరు హత్తుకుని ఆగకుండా కన్నీరు కారుస్తూనే ఉన్నారు. పిల్లాడు కోమా నుంచి లేచాడని తెలియగానే, ఆ తల్లి పరుగుపరుగున ఆసుపత్రికి చేరుకుంది. పిల్లాడిని చూడగానే తల్లి... అమ్మను చూడగానే పిల్లాడు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

బాధితులను అనుక్షణం కనిపెట్టుకోవాలి..
ఈ పోస్టు క్యాప్షన్‌లో..‘ పిల్లాడు పుట్టుకతోనే డిస్ట్రోఫిక్ ఎపిడెర్మోలిసిస్ బులోసా అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ స్థితి టైప్‌-VII కొలోజన్‌ లేమి కారణంగా తలెత్తుతుంది. ఇది ఒక ప్రొటీన్‌. ఇది చర్మంలోని ఎపిడర్మిస్‌ను అనుసంధానిస్తుంది. దీనిని బైండింగ్‌ ప్రొటీన్‌ అని అంటారు. ఇటువంటి స్థితిలోఉన్న గుడ్‌ను అతని తల్లిదండ్రులు కంటికి రెప్పలా  కాపాడుతున్నారు. గుడ్‌కు ఏ చిన్న దెబ్బ తగిలినా, చర్మానికి ఎంటవంటి ఇబ్బంది కలిగినా వ్యాధి మరింత తీవ్ర మవుతుంది. తాజాగా గుడ్‌ 16 రోజుల పాటు కోమాలో ఉన్నాడు. దీనిలో 14 రోజులు ఇంట్యుబేషన్‌లోనే ఉన్నాడు.

వీడియోను చూసినవారు ఏమంటున్నారంటే..
ఎంతో భావోద్వేగంతో కూడిన ఈ వీడియోను చూసినవారు కంటతడి పెడుతున్నారు. గుడ్‌ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ఒక యూజర్‌ ‘పిల్లాడికి తీవ్రస్థాయిలో నిమోనియా సోకింది. అందుకే కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ పిల్లాడి తల్లి రోజూ అతని దగ్గరే ఉంటుంది. అయితే ఆ పిల్లాడు కోమాలోంచి లేచిన రోజే బయటకు వెళ్లింది’ అని రాశారు. మరో యూజర్‌ ఈ వీడియోను చూశాక ‘నా హృదయం కల్లోలంగా మారిందని’ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: హజ్‌యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే..

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!