Breaking News

ఇలాంటి వ్యక్తి సామాన్యుల క‌ష్టాల‌ను తొల‌గిస్తాడా?

Published on Sat, 07/05/2025 - 18:01

న్యూయార్క్‌ నగరంలో ఆర్థిక అసమానతలను రూపుమాపుతానంటూ సోషలిస్ట్‌ తరహా వాగ్దానాలు చేస్తున్న డెమొక్ర‌టిక్ పార్టీ మేయర్‌ అభ్యర్థి జొహ్రాన్‌ ఖ్వామీ మమ్దానీ(33)పై విమర్శల దాడి పెరిగింది. భారతీయ మూలాలున్న మమ్దానీ తల్లిదండ్రులు మీరా నాయర్, మహూమ్ద్‌ మమ్దానీల ఆస్తిపాస్తుల వివరాలనే అస్త్రాలుగా మార్చుకున్న విమర్శకులు.. ఆయనకు సోషలిజం (Socialism) గురించి మాట్లాడే అర్హత లేదని దెప్పి పొడుస్తున్నారు. మమ్దానీ కుటుంబ నేపథ్యానికి, ఆయనిస్తున్న వాగ్దానాలకు పొంతనే లేదంటున్నారు.

జొహ్రాన్‌ మమ్దానీ (Zohran Mamdani)కి ఉగాండాలో ఉన్న నాలుగెకరాల ప్లాట్‌ విలువే 2.50 లక్షల డాలర్ల ఖరీదుంటుందని, ఖరీదైన మన్‌హట్టన్‌ ప్రాంతంలో విలాస వంతమైన నివాస భవనముందని చెబుతున్నారు. మమ్దానీ కుటుంబానికి 10 లక్షల డాలర్ల దాకా విలువైన ఆస్తులున్నాయని ట్రంప్‌ తరఫున లారా లూమర్, మెఘన్‌ మెక్‌కెయిన్‌ తెలిపారు.

ఉన్నత విద్య, పలుకుబడి కలిగిన కుటుంబం నుంచి వచ్చిన జొహ్రాన్‌ మమ్దానీకి సగటు ఉద్యోగికి ఉండే ఇబ్బందులేమీ లేవని, ఇటువంటి వ్యక్తి సామాన్యుల ఇబ్బందులను ఎలా తీరుస్తాడని వారు ప్రశ్నిస్తున్నారు. న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికలు మరో నాలుగు నెలలుండగా, మమ్దానీపై విమర్శలు ఇప్పటికే తీవ్ర రూపం దాల్చడం గమనార్హం.

చ‌ద‌వండి: నీ భార్య నిన్ను వ‌దిలి వెళ్లిపోతుంది

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)