Breaking News

వీసా రహిత ప్రయాణికులకు.. సోషల్‌ మీడియా స్క్రీనింగ్‌

Published on Fri, 12/12/2025 - 03:40

వాషింగ్టన్‌: విదేశీయులకు ప్రవేశ ని బంధనలను అగ్ర రాజ్యం అమెరికా నానాటికీ కఠినతరం చేస్తోంది. మూడో ఓరియన్‌ దేశాల వారికి శాశ్వతం తలుపులు మూసేస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశించే వెసులుబాటున్న దేశాలకు చెందిన ప్రయాణికుల కూడా పలు నిబంధనలను వర్తింపజేయాలని అమెరికా అంతర్గత భద్రత (హోమ్‌ లాండ్‌ సెక్యూరిటీ) విభాగం తాజాగా నిర్ణయించింది. 

ప్రవేశానికి అనుమతించే ముందు వారి సోషల్‌ మీడియా హిస్టరీ, ఇ మెయిల్‌ ఖాతాలు, కుటుంబ సమగ్ర చరిత్ర తదితరాలను లోతుగా పరిశీలించనుంది. బుధవారం ఫెడరల్‌ రిజిస్టర్‌ లో ప్రచురించిన నోటీసులో ఈ మేరకు స్పష్టంగా పేర్కొన్నారు. వారి తాలూకు ఐదేళ్ల సోషల్‌ మీడియా సమాచారాన్ని వడపోయాలని కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ (సీబీపీ) ప్రతిపాదించినట్టు అందులో పొందుపరిచారు. అంతేగాక ఐదేళ్లలో వారు వాడిన ఫోన్‌ నంబర్లు తదితరాలను కూడా ఇకపై విధిగా వెల్లడించాల్సి ఉంటుంది. 

దాదాపు 40 దేశాలకు అమెరికాలోకి వీసారహిత ప్రవేశం అందుబాటులో ఉంది. అక్కడి పౌరులు అగ్ర రాజ్యానికి వెళ్లాలంటే ఎల్రక్టానిక్‌ సిస్టం ఫర్‌ ట్రావెల్‌ అథరైజేషన్‌లో ఆన్‌ లైన్‌లో వివరాలు పొందుపరిస్తే సరిపోతుంది. ఆ పద్ధతిని ఇకపై మార్చనున్నారు. అభంతరాల స్వీకరణ, వారి అనంతరం 60 రోజుల్లో ఈ నిబంధనలన్నీ అమల్లోకి రానున్నాయి. దీనివల్ల అమెరికాకు పర్యాటకపరంగా నష్ట ఉండబోదని మీడియా ప్రశ్నలకు బదులు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అమెరికాకు వీసారహిత ప్రవేశ వెసులుబాటున్న 40 దేశాల్లో అత్యధికం యూరప్, ఆసియా దేశాలే.  

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)