Breaking News

అమెజాన్‌లో కార్చిచ్చులు..బ్రెజిల్‌ను కమ్మేసిన పొగ

Published on Tue, 10/01/2024 - 12:32

బ్రసిలియా: అమెజాన్‌ అడవుల్లో కార్చిచ్చులు దావానలంలా వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చుల దెబ్బకు 80శాతం బ్రెజిల్‌ను పొగకమ్మేసింది. రెండేళ్ల క్రితం పక్కకు పెట్టిన కొవిడ్‌ మాస్కులకు బ్రెజిల్‌ ప్రజలు మళ్లీ పనిచెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. గత 14 ఏళ్లలో ఇంతటి కార్చిచ్చులు రాలేదని ఈయూ కోపర్నికస్‌ అబ్జర్వేటరీ పేర్కొంది. 

ఓవైపు బ్రెజిల్‌ తీవ్రమైన కరువులో అల్లాడుతుంటే మరోవైపు కార్చిచ్చులు ఉన్న పచ్చదనాన్ని దహనం చేస్తున్నాయి. అమెజాన్‌ పరివాహక ప్రాంతాల్లోని ఇప్పటికే అర్జెంటీనా, బ్రెజిల్‌, బొలివియా, కొలంబియా, ఈక్వెడార్‌, పరాగ్వే, పెరూల్లో లక్షల హెక్టార్ల అటవీ భూమి, పొలాలు దహనమైపోయాయి.భూమిపై అమెజాన్‌ బేసిన్‌కు అత్యంత తేమ ప్రాంతంగా పేరుంది. 

కార్చిచ్చులతో కమ్మేసిన పొగ పీలిస్తే రోజుకు ఐదు సిగరెట్లు తాగినంత ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగ వల్ల రాజధాని బ్రసిలియాలో ఆస్పత్రులకు చాలామంది రోగులు శ్వాస సంబంధ ఇబ్బందులతో  చికిత్స కోసం వస్తున్నారు. బ్రసిలియాలో దాదాపు 160 రోజులుగా చుక్క వర్షం పడలేదు. 

దీంతో ప్రజలు  తడి గుడ్డలపై ఫ్యాన్‌ గాలి వచ్చేలా చేసి పొడి వాతావరణం నుంచి ఉపశమనం పొందుతున్నారు. సాగుకు వినియోగించేందుకుగాను అటవీభూమికి ప్రజలు నిప్పుపెడుతున్నట్లు గుర్తించారు. సోమవారం(సెప్టెంబర్‌30) బ్రెజిల్‌ పొరుగునున్న బొలీవియాలో కార్చిచ్చులను నేషనల్‌ డిజాస్టర్‌గా ప్రకటించారు. 

ఇదీ చదవండి: జూ కీపర్‌ను కొరికి చంపిన సింహం

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)