Breaking News

జనావాసంలో కూలిన చిన్న విమానం 

Published on Fri, 05/23/2025 - 01:30

శాన్‌ డియాగో: అమెరికాలోని శాన్‌ డియాగో శివారులోని జనావాసాల మధ్య గురువారం తెల్లవారుజామున చిన్న విమానం ఒకటి కూలింది. ఈ ఘటనలో పలువురు మృత్యువాతపడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమాన శకలాలతోపాటు ఇంధనం పారబోసినట్లు పడి మండటంతో 15 ఇళ్లలో మంటలు చెలరేగాయి. మరో డజను వరకు కార్లు కాలిపోయాయని అధికారులు తెలిపారు. 

జనావాసాలున్న చోట విమాన ప్రమాదం చోటుచేసుకుందన్నారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని ఆస్పత్రిలో చేర్చామని, మరో ఇద్దరికి స్వల్పంగానే గాయాలయ్యాయన్నారు. కూలిన ప్రైవేట్‌ సెస్నా రకం విమానంలో 10 మంది వరకు ప్రయాణించే వీలుందని, ఘటన సమయంలో అందులో ఎందరున్నారనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. బుధవారం రాత్రి న్యూయార్క్‌ నగరంలోని టెటెర్‌»ొరో ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ తీసుకునన ఈ విమానం కన్సాస్‌ రాష్ట్రం విచిటాలోని కల్నల్‌ జేమ్స్‌ జబరా ఎయిర్‌పోర్టులో కాసేపు ఆగింది. 

అనంతరం టేకాఫ్‌ తీసుకున్న ఈ విమానం శాన్‌ డియాగోలోని మాంట్‌గోమెరీ–గిబ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండవ్వాల్సి ఉందని సమాచారం. మరో మూడు మైళ్ల ప్రయాణం ఉందనగా ప్రమాదంలో చిక్కుకుందన్నారు. విమానం పైలట్‌ నుంచి ఎటువంటి ప్రమాద సంకేతాలు రాలేదని తెలిపారు. అక్కడికి సమీపంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సైనికుల నివాస ప్రాంతముందని చెప్పారు. కాగా, అలాస్కాలోని ఓ కంపెనీకి చెందిన ఈ విమానం 1985లో తయారైంది. సుమారు 4 గంటల సమయంలో దట్టంగా మంచుకురుస్తుండగా విమానం కరెంటు తీగలను తాకడం వల్ల ప్రమాదానికి గురైందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని అధికారులు వివరించారు.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)