Breaking News

ఆకాశం నుంచి దూసుకొచ్చిన మృత్యువు.. అదృష్టం బాగుండటంతో

Published on Tue, 10/12/2021 - 09:19

ఒట్టావా: మనిషి జీవితం అనేది ఈ విశ్వంలోనే అత్యంత మిస్టరీతో కూడిన విషయం. మన జీవితంలో ఏ నిమిషం ఏం జరుగుతుందో చెప్పడం ఎవరి వల్ల కాదు. జీవితంలో మనం కొన్ని ఆశ్చర్యకరమైన అంశాల గురించి వింటుంటాం. మన జీవితంలో కూడా అలా జరిగితే బాగుండు అనుకుంటాం. కానీ కొన్ని సార్లు అవి అటు ఇటు అయ్యి మన జీవితాలను ప్రమాదంలో పడేస్తాయి.

ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఈ కోవకు చెందిన వార్తే. సాధారణంగా చాలా మంది నక్షత్రం రాలిపడే సమయంలో ఏం కోరుకున్నా జరుగుతుందని నమ్ముతారు. కానీ అదే నక్షత్రం మీ బెడ్‌రూమ్‌లో రాలితే.. ఎలా ఉంటుంది.. ఊహించుకోవడానకే చాలా భయంకరంగా ఉంది కదా.. ఇదే సంఘటన వాస్తవ రూపం దాల్చింది కెనడాలో. ఆ వివరాలు..

అక్టోబర్ 4న ఈ సంఘటన చోటు చేసుకుంది.. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని రూత్ హామిల్టన్ అనే మహిళ తన బెడ్రూంలో నిద్రపోతుంది. ఉన్నట్టుండి ఏదో శబ్దం వినిపించడంతో ఆమె దిగ్గున లేచింది. చూస్తే.. రూత్‌ దిండుపై ఓ నల్లని వింత పదార్థం కనిపించింది. పరీక్షగా చూసి ఆమె షాకయ్యింది. ఎందుకంటే అదోక ఉల్క. రూత్‌ లేచిన వేళ బాగుండటంతో ఆమె పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఎందుకంటే ఉల్క ఆమె మీద కాకుండా.. దిండుపై పడటంతో ప్రమాదం తప్పింది. వెంటనే లేచి ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్‌ చేసింది. 
(చదవండి: కెనడాలో వింత వ్యాధి కలకలం.. ఇప్పటికే 48 మంది..)

ఈ సందర్భంగా రూత్‌ మాట్లాడుతూ.. ‘‘జీవితాన్ని తేలికగా తీసుకోకుడదని ఈ ప్రమాదంతో నాకు అర్థం అయ్యింది. శబ్దం వినపడగానే నేను బెడ్‌ మీద నుంచి లేవకపోతే ఏం జరిగి ఉండేదో ఆలోచించాలంటేనే భయంగా ఉంది. నేను చనిపోయి ఉండేదాని. అదృష్టం బాగుంటడంతో బతికి బయటపడ్డాను. ఈ నక్షత్రాన్ని నేను దాచుకుంటాను. నా మనవళ్లు దీన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు’’ అని తెలిపింది. ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
 

చదవండి: పువ్వును వాసన చూసి నరకం అనుభవించిన అమ్మాయిలు

#

Tags : 1

Videos

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

సుమోలు, కేరళాలు.. గుడ్ ఫ్రెండ్స్ ఏందయ్యా ఈ బ్రాండ్లు..!

రెడ్ బుక్ రాజ్యాంగంలో 390 మంది హత్యకు గురయ్యారు

Photos

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)