Breaking News

షేక్‌ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష

Published on Wed, 07/02/2025 - 16:28

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు బుధవారం ఆరు నెలల జైలు శిక్షపడింది. ఆడియో లీక్‌ వ్యవహారంలో.. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) కోర్టు ధిక్కరణ కింద ఆమెకు ఈ శిక్ష విధించిందని సమాచారం. 

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్షపడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లా న్యాయస్థానం ఆమెకు ఈ శిక్ష విధించిందని బుధవారం(జులై 2న) అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది.  గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి, దేశం వీడిన షేక్‌ హసీనా.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. 

అయితే.. గత ఏడాది అక్టోబర్‌లో షేక్ హసీనా.. రాజకీయ నాయకుడు షకీల్ అకాండ్ బుల్బుల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. అందులో న్యాయవ్యవస్థను బెదిరించేలా ఉన్న వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలకుగానూ హసీనాకు ఆరు నెలలు, షకీల్ బుల్బుల్‌కు 2 నెలల జైలు శిక్ష విధిస్తూ జస్టిస్ ఎం.డి. గోలం మోర్టుజా మొజుందర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పు ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ (ICT) ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు 30 శాతం కోటా కొనసాగించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై నిరుద్యోగులు కిందటి ఏడాది జూన్‌లో ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఈ కోటాను సమర్థిస్తూ తీర్పు ఇవ్వడంతో.. నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ, నిరసనలు తగ్గలేదు. క్రమంగా ఆ ఆందోళన హింసాత్మకంగా మారింది. ఘర్షణల్లో 300 మందికి పైగా మరణించగా.. వేలాది మందికి గాయాలయ్యాయి. కర్ఫ్యూ, ఇంటర్నెట్ షట్‌డౌన్, సైన్యం మోహరింపు వంటి కఠిన చర్యలు తీసుకున్నా.. పరిస్థితి అదుపులోకి రాలేదు. చివరకు.. షేక్ హసీనా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనలు ప్రధాని నివాసాన్ని తాకడంతో.. ఆమె అక్కడి నుంచి భారత్‌కు వచ్చేశారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె రాజీనామా అనంతరం, తాత్కాలిక ప్రధానిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)