Breaking News

Sweden: జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు మృతి

Published on Sat, 11/15/2025 - 07:13

స్టాక్‌హోమ్‌: స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ స్టాక్‌హోమ్‌లోని ఓస్టర్‌మాల్మ్ పరిధిలోని, రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సమీపంలోని వల్హల్లావాగెన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం 3.23 గంటల ప్రాంతంలో  అత్యంత రద్దీ సమయంలోఒక సిటీ బస్సు అకస్మాత్తుగా బస్ స్టాప్ క్యూలో వేచి ఉన్న జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
 

ప్రమాదానికి గురైన బస్సు సర్వీసులో లేదని, అందులో ప్రయాణీకులు ఎవరూ లేరని అధికారులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా  గాయపడిన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం వెనుక కారణాలను తెలుసుకునేందుకు ఆయనను ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్వీడన్ ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ‘బస్ స్టాప్‌లో పలువురు మరణించడం, మరికొందరు గాయపడటం తీరని విషాదం... బహుశా వారు ఇంటికి వెళ్తున్న కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కావచ్చు’ అని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా రాశారు. కాగా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Bihar Election: యూట్యూబర్ అభ్యర్థి సంగతేంటి?

#

Tags : 1

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు