Breaking News

పీవోకేలో పాక్‌ ఆర్మీ కాల్పులు.. ఆరుగురు మృతి

Published on Tue, 07/14/2026 - 17:33

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రావాలాకోట్లోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో సాధారణ ప్రజలపై అక్కడి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి.  ఇస్లామాబాద్ (పాకిస్తాన్ ప్రభుత్వం)పై స్థానికుల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత ఒక్కసారిగా పెరిగాయి. పీవోకే ప్రజలు పాక్‌కు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు.

వైట్‌హౌస్‌ ఎదుట నిరసన

కాగా ఇటీవలే అమెరికాలో ఉన్న పీవోకే ప్రజలు వాషింగ్టన్‌లో ఉన్న వైట్ హౌస్ వెలుపల నిరసన కార్యక్రమం చేపట్టారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో పెద్దఎత్తున హింసచేలరేగుతందని పాకిస్థాన్‌ ఆ ప్రాంతంలో మానవహక్కులని కాల రాస్తుందని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం పీవోకేలో జరుగుతున్న మానవతా సంక్షోభంపై దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. PoK లోని పౌర నివాస ప్రాంతాల నుండి పాకిస్తాన్ సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, నిరాయుధులైన పౌరులపై ప్రాణాంతక బలగాలను ప్రయోగించడాన్ని అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంతలోనే మరోసారి ప్రాంతంలోకాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. 

భారత్ సహాయం చేయాలి

దాదాపు 40 లక్షల మంది ప్రజలను బాహ్య ప్రపంచానికి దూరం చేస్తూ పాక్ ప్రభుత్వం అక్కడ సుదీర్ఘకాలంగా ఇంటర్నెట్‌ను నిలిపివేసిందని నిరసనకారులు ఆరోపించారు. స్థానిక ప్రజల ప్రాణాలను కాపాడటానికి, మానవతా సహాయాన్ని అందించడానికి భారతదేశం జోక్యం చేసుకోవాలని వారు ఒక అసాధారణ విజ్ఞప్తి చేశారు. బాధితులకు అవసరమైన సాయం అందేలా పూంచ్, డోడా సెక్టార్ల ద్వారా నియంత్రణ రేఖను తెరవాలని డిమాండ్ చేశారు.

పేదరికంతో సతమతమవుతున్న ‍ప్రజలు
తాజా ఘర్షణల పక్కన పెడితే, అక్కడి ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు తెలిపాయి.'నేచర్'జర్నల్ 2025 నాటి అధ్యయనం ప్రకారం, ఇక్కడి జనాభాలో 66% మంది వ్యవసాయం, పశుపోషణపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయినప్పటికీ 57% కంటే ఎక్కువ కుటుంబాలు ఆహార భద్రత లేకుండా నివసిస్తున్నాయి. దాదాపు 29% మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు (పాకిస్తాన్ జాతీయ సగటు 19.9% కంటే ఇది చాలా ఎక్కువ). పర్వత ప్రాంతాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది, అక్కడ 90% కుటుంబాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి.

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)