Breaking News

ఉగ్రవాదంపై పోరుకు పర్యాయపదం ‘సింధూర్‌’: ఎంపీ బన్సూరి

Published on Fri, 05/23/2025 - 09:42

అబుదాబి: ‘ఆపరేషన్‌ సింధూర్‌’(Operation Sindhur)తో ఉగ్రవాదంపై భారతదేశ దృఢ వైఖరి ప్రపంచం ముందు వ్యక్తమయ్యిందని, భారత్‌ చేపట్టిన ఈ మిషన్‌ ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత బలపరిచిందని బీజేపీ మహిళా నేత బన్సూరి స్వరాజ్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ‘ఆపరేషన్‌ సింధూర్‌’పై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం సాగిస్తోంది. దీనిలో భాగంగా శివసేన ఎంపీ శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఉన్నత స్థాయి అఖిలపక్ష ప్రతినిధి బృందం యూఏఈలో పర్యటిస్తోంది. ఈ బృందంలో భాగస్వామ్యురాలైన బీజేపీ మహిళా నేత బన్సూరి స్వరాజ్‌ యూఏఈలోని భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు.

తొలుత బన్సూరి.. భారత్‌- గల్ఫ్ దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో  కీలక పాత్ర పోషిస్తున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదం(Terrorism)పై భారతదేశ దృఢమైన వైఖరి గురించి ఆమె మాట్లాడుతూ, భారత సాయుధ దళాల పరాక్రమంతో సాగిన ఆపరేషన్‌ సిందూర్ ఇప్పుడు  ఉగ్రవాదంపై పోరాటానికి పర్యాయపదంగా మారిందని అన్నారు. ఏప్రిల్ 22న భారతీయుల ఉనికిపై అనాగరిక దాడి జరిగిందని, దానికి భారత్‌ తగిన సమాధానం ఇచ్చిందని, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను తుదముట్టించిందని అన్నారు.
 

పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచంతో కలసి పోరాడేందుకు బదులు దానిని తీవ్రతరం చేయాలని ప్రయత్నిస్తున్నదని బన్సూరి పేర్కొన్నారు. ఉగ్రదాడిపై ప్రతిస్పందన విషయంలో భారత్‌ అపారమైన సంయమనం, పరిణతితో వ్యవహరించిందని అన్నారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే మాట్లాడుతూ తాము సాగిస్తున్న ఈ పర్యటన.. పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న తప్పుడు ప్రచారానికి ముగింపు పలుకుతుందని అన్నారు. సత్యాన్ని ఎంత అణచివేసినా, దానిని మటుమాయం చేయలేరని అన్నారు. యూఎఈ(UAE)లో భారత ప్రతినిధి బృందానికి శివసేన ఎంపి శ్రీకాంత్ షిండే నాయకత్వం వహిస్తున్నారు. అఖిలపక్ష ప్రతినిధి బృందంలో ఎంపీలు బన్సూరి స్వరాజ్, ఈటీ మొహమ్మద్ బషీర్, అతుల్ గార్గ్, సస్మిత్ పాత్ర, మనన్ కుమార్ మిశ్రా, బీజేపీ నేత సురేంద్రజీత్ సింగ్ అహ్లువాలియా, మాజీ రాయబారి సుజన్ చినోయ్ తదితరులున్నారు.

ఇది కూడా చదవండి: ట్రంప్‌ ఆదేశాలు.. వారికి ‘హార్వర్డ్‌’లో నో అడ్మిషన్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)