Breaking News

హల్వాదే హవా

Published on Sat, 07/12/2025 - 05:49

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో రెండు వారాలుగా ఎటు చూసినా భారతీయతే ఉట్టిపడుతోంది. తన కుశాగ్రబుద్ధి, మానసిక స్థైర్యం, పైలట్‌ నైపుణ్యాలతో ఇప్పటికే యాగ్జియం–4 మిషన్‌లోని సహచరులను అబ్బురపరిచిన భారత వ్యోమగామి, వాయుసేన గ్రూప్‌కెపె్టన్‌ శుభాంశు శుక్లా తాజాగా భారతీయ రుచులతో వారితో పాటు ఐఎస్‌ఎస్‌లోని మిగతా సహచరుల మనసు కూడా దోచుకున్నారు! 

తనతో పాటు ఐఎస్‌ఎస్‌లోకి వెంట తీసుకెళ్లిన క్యారెట్‌ హల్వాను వారితో పంచుకున్నారు. రెండు వారాలుగా ఊపిరి సలపని పనులతో తలమునకలుగా ఉన్న వ్యోమగాములంతా శుక్రవారం ఆటవిడుపుగా, సరదా సరదాగా గడిపారు. చివరగా భోజనంలోకి నచ్చిన రుచులను తనివితీరా ఆస్వాదించారు. రొయ్యల వేపు డు స్టార్టర్‌తో మొ దలుపెట్టి చవులూరించే చికెన్‌ వంటకాల దాకా పలురకాలను ఆరగించా రు. 

చివర్లో శుభాంశు వడ్డించిన క్యారె ట్‌ హల్వా, పెసరప ప్పు హల్వా విందుకే హైలైట్‌గా నిలిచా యి. ఇంతటి రుచి ఇంతకు ముందెన్న డూ ఎరగమంటూ సహచరులంతా ఆయన్ను మెచ్చుకున్నారు. హల్వాను జీవితంలో మర్చిపోలేనని వ్యోమగామి జానీ కిమ్‌ చెప్పుకొచ్చారు. రుచిలో తేడా రాకుండా దీర్ఘకాలం పాటు నిల్వ ఉండేలా ఆ మిఠాయిలను ఇస్రో, డీఆర్‌డీవో శుభాంశు కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశాయి. 

శుభాంశును అలా కాపాడుకున్నాం: ఇస్రో చీఫ్‌ 
రాకేశ్‌ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అంతరిక్షంలో అడుగుపెట్టిన, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి ప్రవేశించిన తొలి భారతీయునిగా శుభాంశు పేరు కొద్ది వారాలుగా దేశమంతటా మార్మోగిపోతోంది. యువతతో పాటు దేశంలోని బాల బాలికలంతా ఆయనను ఓ హీరోగా, తమ స్ఫూర్తిప్రదాతగా చూస్తున్నారు. 

ఇస్రో అప్రమత్తంగా వ్యవహరించబట్టి సరిపోయింది గానీ, లేదంటే ఇన్ని ఘనతలకు కారణమైన యాగ్జియం అంతరిక్ష యాత్ర ఆరంభమైన కాసేపటికే విషాదాంతమయ్యేదే! ఒళ్లు గగుర్పొడిచే ఈ వాస్తవాన్ని స్వయానా ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌ బయట పెట్టారు. జూన్‌ ప్రథమార్ధంలో యాత్ర పలుమార్లు వాయిదా పడటం తెలిసిందే. ఆ క్రమంలో జూన్‌ 11 నాటి ప్రయోగాన్ని ఒక్క రోజు ముందు ఇస్రో పట్టుబట్టి ఆపించింది. ‘‘ఫాల్కన్‌–9 రాకెట్‌ తాలూకు బూస్టర్‌లో లీకేజీలను, పలు పగుళ్లను ఇస్రో బృందం జూన్‌ 10 సాయంత్రం గమనించింది. 

అప్పటికప్పుడు చర్చించి ప్రయోగాన్ని ఆపాలని నా సారథ్యంలోని ఇస్రో బృందం నిర్ణయం తీసుకుంది. లేదంటే యాగ్జియం–4 ప్రయోగం విషాదాంతం అయ్యేదేమో! అలాకాకుండా చూడటం ద్వారా మన శుభాంశును, యాగ్జి యం మిషన్‌ను కాపాడుకున్నాం’’అని తాజా గా ఓ కార్యక్రమంలో ఇస్రో చీఫ్‌ వివరించారు. ‘‘మేం మరీ అతిగా స్పందిస్తున్నామని స్పేస్‌ ఎక్స్‌ బృందం తొలుత నిందించింది. అయినా మేం పట్టుబట్టి ప్రయోగాన్ని నిలిపేయించాం. ఫాల్కన్‌ రాకెట్లో పగుళ్లను మర్నాడు స్పేస్‌ ఎక్స్‌ ఇంజనీర్లు  ధ్రువీకరించారు’’అని తెలిపారు. నాసా, ఇస్రో సంయుక్త ప్రాజె క్టైన యాగ్జియం–4 జూన్‌ 26న విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లడం తెలిసిందే.

కుటుంబంతో శుభాంశు మాటామంతి 
శుభాంశు శుక్రవారం లఖ్‌నవూలోని తన కుటుంబసభ్యులతో మాట్లాడారు. తను ప్రయోగాలన్నీ దిగి్వజయంగా పూర్తి చేసి సురక్షితంగా తిరిగి రావాలని ఆయన తల్లిదండ్రులు ఆశా, శంభూదళాళ్‌ శుక్లా ఆకాంక్షించారు. ‘‘ఐఎస్‌ఎస్‌లో తను ఎక్కడ పని చేసే దీ, రోజంతా ఎలా గడిపేదీ శుభాంశు మాకు పూసగుచ్చినట్టు చూపించాడు. అంతరిక్షం నుంచి భూమిని చూసేందుకు రెండు కళ్లూ చాలవట! తన విధులను పూర్తిగా ఆస్వాది స్తుండటం మాకెంతో సంతోషాన్నిస్తోంది’’అని చెప్పుకొచ్చారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)