Breaking News

ఇజ్రాయెల్‌ ఎంబసీ వద్ద కాల్పుల కలకలం

Published on Sun, 11/24/2024 - 12:40

ఉమాన్‌: జోర్డాన్‌లోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద కాల్పులు కలకలం రేపాయి. ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పలువురు దుండగులు కాల్పులకు పాల్పడడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అనంతరం దుండగులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ దుండగుడు మరణించగాముగ్గురు పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది.

కాల్పుల్లో గాయపడ్డవారిని ఆస్పత్రికి  తరలించామని,ఎంబసీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని అధికారులు తెలిపారు. ఎంబసీ సమీపంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్‌ దాడులకు నిరసనగా జోర్డాన్‌లోని ఇజ్రాయెల్‌ ఎంబసీ  ప్రాంతంలో పలుమార్లు నిరసనలు జరిగాయని పోలీసులు తెలిపారు.

2023 అక్టోబర్‌ 7న హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లో చొరబడి వందల మంది ఇజ్రాయెల్‌ పౌరులను హత్య చేయడంతో గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు మొదలయ్యాయి. ఈ దాడుల్లో 44 వేల మంది గాజా వాసులు  ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా చెబుతోంది. కాగా మరోవైపు ఇజ్రాయెల్,లెబనాన్‌ మధ్య కాల్పుల విరమణ కోసం కొద్ది కాలంగా చర్చలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి: భారత్‌లో ఓట్ల లెక్కింపుపై మస్క్‌ ఆసక్తికర ట్వీట్‌ 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)