ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!
Breaking News
అమెరికాలో కాల్పుల కలకలం
Published on Fri, 03/13/2026 - 07:30
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో కలకలం చోటుచేసుకుంది. మిచిగాన్‌లోని వెస్ట్ బ్లూమ్ సిటీ ప్రాంతంలో యూదుల ప్రార్థనామందిరం వద్దకు పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో వచ్చి ఢీకొట్టాడు. అనంతరం అగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా అతడిని కాల్చి చంపారు.
ఇక కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి దాడులు మరోసారి జరగొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రారంభదశలోనే నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, నిందితుడు కాల్పులకు ఎందుకు తెగబడ్డాడు? కుట్రకోణం ఉందా? లేదా అనే ఇతర కారణాలు తెలియాల్సి ఉంది.
Tags : 1