తల తీయడం మొదలు తుపాకీతో కాల్చడం వరకూ.. ఏ దేశంలో ఎటువంటి మరణశిక్ష?

Published on Thu, 09/21/2023 - 08:33

ప్రపంచంలోని వివిధ దేశాలలో ఒకే రకమైన నేరానికి వేర్వేరు శిక్షల నిబంధన కనిపిస్తుంది. చిన్న నేరాలకు సైతం కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే దేశాలు అనేకం ఉన్నాయి. హత్య, అత్యాచారం, వికృత హింస వంటి తీవ్రమైన నేరాలకు మరణశిక్ష విధించే నిబంధన చాలా దేశాలలో అమలులో ఉంది. అయితే ప్రపంచంలోని వివిధ దేశాలు మరణశిక్షకు సంబంధించి వివిధ పద్ధతులను అనుసరిస్తాయి. భారతదేశంలో ఉరి ద్వారా మరణశిక్ష విధిస్తారు. ఈ శిక్ష విధించినప్పుడు దోషిని జైలులోనే ఉరితీస్తారు.

తుపాకీతో కాల్చి..
బీబీసీ నివేదిక ప్రకారం ప్రపంచంలోని 58 దేశాల్లో మరణశిక్ష పడిన ఖైదీలకు ఉరి తీస్తారు. అయితే మరణశిక్ష విధించేందుకు కొన్ని దేశాలలో తుపాకులను ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోని 73 దేశాల్లో ఉరిశిక్షపడిన దోషులను తుపాకీతో కాల్చి మరణశిక్ష విధిస్తున్నాయి. కొన్ని దేశాల్లో మరణశిక్ష విధించడానికి పలు విధానాలు ఉన్నాయి. 

పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి..
ఆఫ్ఘనిస్తాన్, సూడాన్‌తో సహా మొత్తం 6 దేశాల్లో దోషులను రాళ్లతో కొట్టి చంపుతారు. లేదా తుపాకీతో కాల్చడం ద్వారా మరణశిక్ష విధిస్తారు. యెమెన్, బహ్రెయిన్, చిలీ, థాయిలాండ్, ఇండోనేషియా, ఆర్మేనియా వంటి దేశాల్లో కాల్పుల ద్వారా మరణశిక్ష విధిస్తారు. చైనా, ఫిలిప్పీన్స్‌తో సహా ప్రపంచంలోని ఐదు దేశాలలో పాయిజన్‌ ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష విధిస్తారు. ప్రపంచంలోని మూడు దేశాల్లో శిరచ్ఛేదం ద్వారా మరణశిక్ష విధిస్తారు. ఇదిలావుంటే ప్రపంచంలోని చాలా దేశాలు మరణశిక్ష నిబంధనను రద్దు చేశాయి. ఈ జాబితాలో 97 దేశాలు ఉన్నాయి. 
ఇది కూడా చదవండి: రైలు కదిలేముందు జర్క్‌ ఎందుకు? న్యూటన్‌ నియమంతో సంబంధం ఏమిటి?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)