ఇంత విషాదం చోటు చేసుకున్నా కంటిన్యూ చేస్తారా?

Published on Mon, 11/24/2025 - 12:19

దుబాయ్‌లో శుక్రవారం నాటి ఎయిర్‌ షోలో తేజస్‌ యుద్ధ విమానం ప్రమాదానికి గురైన భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) వింగ్‌ కమాండర్‌ నమాంశ్‌ సియాల్‌(37) దుర్మరణం చెందాడు. యుద్ధ విమానం అదుపు తప్పి క్రాష్‌ కావడంతో పైలట్‌ మృత్యువాత పడ్డారు ఇంతటి విషాదం చోటు చేసుకున్న సదరు ఎయిర్‌ షో కొనసాగించడంపై యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పైలట్‌ మేజర్‌ టేలర్‌ ఫెమీ హీస్టర్‌ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.  

ఇంతటి దారుణం చేసుకున్నా షోను ఎలా కొనసాగిస్తారంటూ ప్రశ్నించాడు. ఇదేనా సాటి పైలట్‌ ఇచ్చే గౌరవం అంటూ షో నిర్వహకులపై మండిపడ్డారు. అదే సమయంలో తాను ఈ షోలో పాల్గొననంటూ వైదొలిగారు. 

ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశారు హీస్టర్‌. ‘ మా తుది ప్రదర్శనను ఇవ్వడానికి మా టీమ్‌ సిద్ధంగా లేదు. ఈ షో నుంచి మేము వైదులుగుతున్నాం. అందుకు కారణం.. తేజస్‌ యుద్ధ విమానం కూలిపోయి భారత పైలట్‌ దుర్మరణం చెందితే షోను కొనసాగించాలనుకోవడం మంచి పరిణామం కాదు. ఇదేనా మనం తోటి పైలట్‌కు, వారి కటుంబానికి ఇచ్చే గౌరవం?’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రమాదం జరిగినప్పటికీ ఎగిరే ప్రదర్శనలు కొనసాగుతాయని సమాచారం అందిన తర్వాత ఏం జరిగిందనేది హీస్టర్‌ వివరించాడు. ప్రమాదం జరిగిన గంట, రెండు గంటల మధ్యలో అక్కడకి వెళ్లాను,. అది ఖాళీగా ఉంది. షో ఆపివేయబడుతుందని అనుకున్నాను. అలా జరగలేదు. మళ్లీ యథావిధిగా షో నిర్వహించారు. అందుకే మా టీమ్‌ షో నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది’ యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌  వింగ్‌ కమాండర్‌ తెలిపారు.

ఆరోజు జరిగిన ప్రమాదం తేజస్‌ యుద్ధ విమానం కంట్రోల్‌ తప్పి నేలపై పడటంతో మంటలు చుట్టుముట్టాయి. ఆ ఘటనలో తేజస్‌  పైలట్‌ మాంశ్‌ సియాల్‌ ప్రాణాలు కోల్పోయాడు.

సెల్యూట్‌తో భర్తకు కన్నీటి వీడ్కోలు

#

Tags : 1

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)