Breaking News

పాక్‌లో షియా, సున్నీ పోరు.. 25 మంది మృతి

Published on Thu, 09/26/2024 - 11:51

పెషావర్‌: పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్‌ అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లోని వాయువ్య ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గల కుర్రం జిల్లాలో గత వారం చివర్లో ప్రారంభమైన ఈ ఘర్షణలు  కొంతమేరకు తగ్గాయి. ఈ ఘర్షణల్లో ఇరువర్గాలకు చెందిన 25 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

కుర్రం ప్రాంతం ఇటీవలి కాలంలో మత హింసకు కేంద్రంగా నిలిచింది. ఇక్కడ తలెత్తిన భూవివాదం హింసాత్మకంగా మారకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక్కడి గిరిజన పెద్దల సహాయంతో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ప్రావిన్షియల్ ప్రభుత్వ ప్రతినిధి బారిస్టర్ సైఫ్ అలీ తెలిపారు. కుర్రంలో శాంతి చర్చల అనంతరం ఇకపై ఎలాంటి హింసాకాండకు పాల్పడకుండా ఉండేందుకు ఇరువర్గాలు అంగీకరించాయన్నారు.

సున్నీ ఆధిపత్య పాకిస్తాన్ జనాభాలో 15 శాతం మంది షియా ముస్లింలున్నారు. చాలా కాలంగా ఈ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.  షియా వర్గం ఆధిపత్యం ఉన్న కుర్రం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఇరు వర్గాల మధ్య మధ్య ఉద్రిక్తతలున్నాయి. ఈ ఏడాది జూలైలో జరిగిన భూ వివాద ఘర్షణల్లో ఇరువర్గాలకు చెందిన పలువురు మృతిచెందారు.

కాగా కుర్రం జిల్లాలో హింసను ముగించేందుకు శాంతి ఒప్పందంపై ఇరు వర్గాల పెద్దలు సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వానికి సహకరించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ శాంతి ఒప్పందాన్ని ఏ వర్గమైనా ఉల్లంఘించిన పక్షంలో వారు రూ.12 కోట్ల మేరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: భారీ వర్షాల ప్రభావం: ప్రధాని మోదీ పూణె పర్యటన రద్దు

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)