Breaking News

బంగ్లాలో దాడులకు పాకిస్థానే కారణం: హసీనా కుమారుడు

Published on Thu, 08/08/2024 - 17:21

ఢాకా: బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశం విడిచివెళ్లడంతో అక్కడ సైనిక పాలన కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో ఈ నేపథ్యంలో షేక్‌ హసీనా కుమారుడు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనంతరం షేక్‌ హసీనా తిరిగి స్వదేశానికి వస్తారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో​ తమ దేశంలో ఈ పరిస్థితికి పాకిస్తానే కారణమని సంచలన ఆరోపణలు చేశారు.

ఇక, తాజాగా షేక్‌ హసీనా కుమారుడు సాజీబ్‌ వాజెద్‌ జాయ్‌ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొనసాగుతున్న అనిశ్చితికి పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఆజ్యం పోస్తోంది. విదేశీ జోక్యంతోపాటు పాక్‌ ఐఎస్‌ఐ ప్రమేయం ఉందని చెప్పడానికి క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న ఘర్షణలే ఆధారాలు. దాడులు, ఆందోళనలు చాలా సమన్వయంతో, పక్కా ప్రణాళికతో జరిగినట్లు తెలుస్తోంది. వాటిని రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగానే సోషల్‌ మీడియాలో ప్రయత్నాలు జరిగాయి. పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా.. వాటిని మరింత దిగజార్చేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. ఉగ్రవాద, విదేశీ శక్తులు మాత్రమే సమకూర్చగలిగే ఆయుధాలతో అల్లరిమూకలు పోలీసులపైనే దాడులు చేసిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఈ అరాచకం నుంచి బంగ్లాదేశ్‌ను రక్షించేందుకు సాధ్యమైనంత కృషి చేస్తాను అని కామెంట్స్‌ చేశారు.

ఇదే సమయంలో భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన తల్లికి రక్షణ కల్పించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. మరోవైపు.. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనంతరం షేక్‌ హసీనా తిరిగి స్వదేశానికి వస్తారని సాజీబ్‌ చెప్పుకొచ్చారు. మా పార్టీ వాళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఆపదలో ఉన్న  పౌరులను, అవామీ లీగ్‌ పార్టీని షేక్‌ ముజిబర్‌ రహ్మాన్‌ కుటుంబం ఎన్నటికీ ఒంటరిగా వదలిపెట్టదు. బంగ్లాదేశ్‌లో అవామీ పార్టీకి ఎంతో చరిత్ర ఉంది. అందుకే ఆమె ఆమె తప్పకుండా తిరిగి వస్తారు అని అన్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)