Breaking News

భారత్‌ను ఓడించకపోతే  నా పేరు షెహబాజ్‌ షరీఫే కాదు

Published on Tue, 02/25/2025 - 06:07

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ భీకర ప్రతిజ్ఞ చేశారు. ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమంలో పొరుగుదేశం భారత్‌ను ఓడిస్తానని, లేకపోతే తన పేరు షెహబాజ్‌ షరీఫే కాదని తేల్చిచెప్పారు. ఆయన తాజాగా పంజాబ్‌ ప్రావిన్స్‌లోని డేరా ఖాజీ ఖాన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

పిడికిలి గాల్లో విసురుతూ, పోడియం బల్ల చరుస్తూ ఆవేశంగా మాట్లాడారు. సామాన్య ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని అన్నారు. వారి కనీస అవసరాలు తీర్చడం తమ బాధ్యత అని చెప్పారు. దేశంలో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక పరిస్థితిని సక్రమ మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. భగవంతుడి ఆశీస్సులు పాకిస్తాన్‌కు ఎల్లవేళలా ఉంటాయని వ్యాఖ్యానించారు. 

అభివృద్ధిలో ఇండియాను వెనక్కి నెట్టేయకపోతే తన పేరు షెహబాజ్‌ షరీఫే కాదని స్పష్టంచేశారు. ఇండియాను అధిగమించడానికి చివరి క్షణం దాకా కష్టపడుతూనే ఉంటామని, అందరం కలిసికట్టుగా పని చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రతిజ్ఞపై సోషల్‌ మీడియాలో జనం వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేశారని విమర్శిస్తున్నారు. కేవలం మాటల చెప్పడం కాదు, దమ్ముంటే సాధించి చూపండి అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను గుర్తించకుండా ప్రధానమంత్రి ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారని కొందరు తప్పుపట్టారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)