Breaking News

పాక్‌ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్

Published on Sun, 03/03/2024 - 15:08

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ కొత్త ప్రధాన మంత్రిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేత షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. సంకీర్ణ ప్రభుత్వం తరఫున షెహబాజ్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పాక్‌ ప్రధానమంత్రిగా ఆయన ఎన్నిక కావటం ఇది రెండోసారి. షెహబాజ్ షరీఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా ఎన్నికైనట్లు పాకిస్తాన్‌ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. 2022లో ఇమ్రాన్ ప్రభుత్వం పతనమైన తర్వాత షెహబాజ్ షరీఫ్.. మొదటి సారి ప్రధాని అయ్యారు.

షెహబాజ్‌షరీఫ్‌ నేషనల్‌ అసెంబ్లీలో 201 ఓట్ల సాధించారు. మ్యాజిక్‌ ఫిగర్‌ 169 ఓట్లు. జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ మద్దతు గల ఒమర్‌ అయూబ్‌ 92 ఓట్లకే పరిమితమయ్యారు.

ఇక.. ఇటీవల జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికల్లో 265 స్థానాలకుగాను పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు 93, పీఎంఎల్ఎన్ 75, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) 53, ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం)కి 17 సీట్లు వచ్చాయి.

దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టోకు చెందిన పీపీపీలు కూటమిగా ఏర్పాడ్డాయి. సుదీర్ఘ చర్చల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించి.. ప్రధాని అభ్యర్థిగా  షెహబాజ్ షరీఫ్‌ను ప్రకటించింది.  తాజాగా ఆదివారం జాతీయ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా గెలుపొందారు.

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)