షావోలిన్‌ గురువుపై చైనా విచారణ

Published on Tue, 07/29/2025 - 05:01

బీజింగ్‌: ప్రపంచవ్యాప్తంగా పేరున్న షావోలిన్‌ టెంపుల్‌ అధిపతి షి యోంగ్‌ జిన్‌పై చైనా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. లంచాలు తీసుకోవడం, పలువురు మహిళలతో అనైతిక సంబంధాలు నెరపడం, అక్రమ సంతానాన్ని కలిగి ఉండటం వంటి ఆరోపణలను ఆయనపై మోపిందని టెంపుల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ విభాగాలు దర్యాప్తు చేపట్టాయంది. దాదాపు 1,500 ఏళ్ల చరిత్ర కలిగిన షావోలిన్‌ టెంపుల్‌ సెంట్రల్‌ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంటా ఏటా వేలాదిగా శిష్యులు ఇక్కడికి వచ్చి మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతుంటారు.

షి యోంగ్‌ జిన్‌ ఈ షావోలిన్‌ టెంపుల్‌ అధిపతిగా 1999 నుంచి కొనసాగుతున్నారు. షావోలిన్‌ టెంపుల్‌ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత సొంతం చేసుకున్న ఈయనకు సీఈవో మాంక్‌ అనే పేరూ ఉంది. షి హయాంలోనే షావోలిన్‌ టెంపుల్‌ చైనా వెలుపల కూడా స్కూళ్లను ప్రారంభించింది. సన్యాసుల బృందాలు షావోలిన్‌ కుంగ్‌ఫూ విన్యాసాల్లో పాల్గొనడం మొదలైంది. ‘షి యోంగ్‌జిన్‌ చర్యలు తీవ్రమైనవి, బౌద్ధ వర్గం, సన్యాసుల ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయి’అని బుద్ధిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ చైనా ఒక ప్రకటనలో పేర్కొంది. 
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)